KA Paul : అధికారంలోకి వస్తే.. ఒక్కో కుటుంబానికి కోటి రూపాయలు- కేఏ పాల్ సంచలనం

KA Paul : ఒక ఇడియట్ కారణంగా కేసీఆర్ కి దూరమయ్యా. అందుకే ఆ ఇడియట్ ను దూరం పెట్టా. నా బ్లెస్సింగ్ లేకపోతే చంద్రబాబు సీఎం అయ్యేవాడు కాదు.

KA Paul : అధికారంలోకి వస్తే.. ఒక్కో కుటుంబానికి కోటి రూపాయలు- కేఏ పాల్ సంచలనం

KA Paul (Photo : Twitter)

KA Paul – Praja Shanti Party : చిత్ర విచిత్రమైన హావభావాలతో, అంతకు మించి ఊహకందని మాటలతో నిత్యం వార్తల్లో ఉండే వ్యక్తి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఆయన మరోసారి తనదైన వ్యాఖ్యలతో హైలైట్ అయ్యారు. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే.. అమరుల కుటుంబాలకు చెరో కోటి రూపాయలు ఇస్తామని కేఏ పాల్ హామీ ఇచ్చారు. అంతేకాదు, తెలంగాణ సీఎం కేసీఆర్ కి తనకు శత్రుత్వం లేదన్నారు. ఒక ఇడియట్ కారణంగా తాను కేసీఆర్ కి దూరమైనట్లు వివరించారు. అందుకే ఆ ఇడియట్ ను దూరం పెట్టానని తెలిపారు.

” నిజామాబాద్ లో ప్రజా శాంతి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాలి. కానీ అవినాశ్ రెడ్డి కేస్ ఉంది కాబట్టి నేను వెళ్ళలేదు. అమరుల కుటుంబాలకు అందరికీ కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వాలి. కేసీఆర్ ఇవ్వలేదు. మనం అధికారంలోకి రావడంతోనే ఉద్యోగాలు ఇస్తాము. అలాగే, అమరుల ఒక్కో కుటుంబానికి కోటి రూపాయలు ఇస్తాము. జూన్ 2న అమరుల కుటుంబాలు అందరూ అమరవీరుల స్థూపం దగ్గరికి రండి” అని కేఏ పాల్ అన్నారు.(KA Paul)

Also Read..Mahima Datla : ఆస్తి రూ.8700 కోట్లు..! ఏపీ, తెలంగాణలో అత్యధిక ధనిక మహిళ.. ఎవరీ మహిమా దాట్ల..?

షర్మిల.. నాకు సపోర్ట్ చేయండి:
” రేవంత్ రెడ్డి.. 5 సీట్లు ఉన్న మీరు 20 సీట్లు ఎలా గెలుస్తారు. డూప్లికేట్ గాంధీ కుటుంబం మనకెందుకు? కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంది. కాంగ్రెస్ అధిష్టానానికి వందల కోట్లు ఇచ్చి రేవంత్ రెడ్డి పదవి తెచ్చుకున్నారు. బడుగు, బలహీనవర్గాలకు అధికారం వద్దా? కోదండరాం, ప్రవీణ్ కుమార్, షర్మిల.. ప్రజలకు మేలు చేయాలని మీకుంటే.. జనాలకు ఉచిత విద్య, వైద్యం, ఉద్యోగాలు ఇవ్వాలని మీకు ఉంటే.. మీరు నాకు సపోర్ట్ చేయండి. నేను విద్యార్థులకు, జనాలకు ఉచిత విద్య, వైద్యం చేయిస్తున్నాను” అని కేఏ పాల్ తెలిపారు.

అందుకే.. కవితను అరెస్ట్ చేయడం లేదు:
” అమరావతి రైతుల కోసం పోరాటం చేస్తున్నా. గెలుస్తాము. కెసీఆర్ అమరుల కుటుంబాలకు అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే. అందుకే కవితను అరెస్ట్ చేయడం లేదు. అవినాశ్ రెడ్డి తల్లి కోలుకోవాలని నేను ప్రేయర్ చేశాను. ఆమె కోలుకుంది. ఆంధ్రలో నా బీ-ఫారంలు ఎత్తుకెళ్లారు.(KA Paul)

నా బ్లెస్సింగ్ లేకపోతే చంద్రబాబు సీఎం అయ్యేవాడు కాదు. చంద్రబాబు నరహంతకుడు. కేసీఆర్ కు అప్పులు చేయడం తప్ప అడ్మినిస్ట్రేషన్ చేయడం రాదు. నన్ను కొనేవారు ప్రపంచంలో ఉన్నారా? డబ్బు కోసం మా అన్నను వాళ్ళ భార్య, పిల్లలు చంపారు. రఘురామకృష్ణరాజు మళ్ళీ గెలవడు. రఘు రామకృష్ణరాజు దేవుడిని, నన్ను అపహాస్యం చేస్తున్నావు. నువ్వు మళ్ళీ గెలవవు. (KA Paul)

Also Read..MLC Kavitha: ఇది కల కాదు కదా..? శుభకార్యంలో పాల్గొని మాట్లాడుకున్న బండి సంజయ్, కల్వకుంట్ల కవిత.. ఏం జరిగిందంటే?

కేసీఆర్ తో శత్రుత్వం లేదు:
నాకు కేసీఆర్ కు శత్రుత్వం లేదు. ఒక ఇడియట్ వలన నేను కేసీఆర్ కి దూరమయ్యాను. అందుకే ఆ ఇడియట్ ను దూరం పెట్టాను. కేసీఆర్ మీరు పిలవండి నేను వచ్చి కలుస్తాను. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎవరూ చంద్రబాబుతో లేరు” అని కేఏ పాల్ అన్నారు.