వేసవిలో కరెంటు కోతలు ఉండవు.. !

  • Published By: madhu ,Published On : February 29, 2020 / 08:09 AM IST
వేసవిలో కరెంటు కోతలు ఉండవు.. !

తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ను అందిస్తూ అందరితో శభాస్ అనిపించుకుంటోన్న విద్యుత్‌ శాఖ.. మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్లు సక్సెస్‌ ఫుల్‌గా సప్లై చేసి.. ఇంతవరకూ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రికార్డ్‌ను బ్రేక్ చేసింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా తలసరి విద్యుత్ వినియోగాన్ని నమోదు చేసి మిగిలిన రాష్ట్రాల చూపును తనవైపు తిప్పుకుంది. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా అత్యధికంగా కరెంట్‌ను సరఫరా చేసిన ఘనతను శుక్రవారం సొంతం చేసుకుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒకరోజు రికార్డ్ స్థాయిలో ఉన్న వాడకాన్ని తెలంగాణ విద్యుత్ శాఖ తిరగరాసింది. 2014 మార్చి 23న 13 వేల 162 మెగావాట్లుగా నమోదైన రికార్డే ఇప్పటి వరకు హయ్యస్ట్‌ డిమాండ్‌గా ఉంది. శుక్రవారం 3 వేల 168 మెగావాట్లతో  వచ్చిన డిమాండ్‌కు తగ్గ సప్లయ్ ఇచ్చి అప్పటి రికార్డ్‌ను బ్రేక్ చేసింది. గతేడాది సరిగ్గా తెలంగాణలో గరిష్ట డిమాండ్ 9 వేల 770 మెగావాట్లు నమోదైతే .. ఒక్కరోజే 34 శాతం అధిక డిమాండ్ వచ్చింది. 

రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా, ఎత్తిపోతల పథకాల నిర్వహణ, పరిశ్రమల సంఖ్య పెరగడం వంటి కారణాలతో తెలంగాణలో అధిక డిమాండ్ ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు SPDCL, NPDCL పరిధిలోని తెలంగాణలో 5 వేల 661 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఉండేది. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చిన డిమాండ్ 132.6 శాతం అధికంగా ఉంది.

తెలంగాణలో విద్యుత్ గరిష్ట డిమాండ్‌తో పాటు విద్యుత్ వినియోగం కూడా అంతకంతకూ పెరుగుతూ వస్తుంది. 2014లో తెలంగాణ రాష్ట్రంలో 47 వేల 338 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగగా, 2018 – 19 సంవత్సరంలో 68 వేల 147 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగింది. గడిచిన ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో 44 శాతం అధిక విద్యుత్ వినియోగం జరిగింది. 

వ్యవసాయ, పారిశ్రామిక రంగాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పట్టణీకరణ శరవేగంగా పెరుగుతుండడం వల్లే విద్యుత్ వినియోగానికి కారణమంటున్నారు అధికారులు.  ఇప్పటికే కోతల్లేని కరెంట్‌ను అందిస్తున్న అధికారులు ఒకవేళ ప్రస్తుతం ఇప్పుడున్న డిమాండ్ కన్నా.. ఎక్కువ డిమాండ్ వచ్చినా ప్రాబ్లెమ్‌ అంటున్నారు . ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేసేందుకు సిద్ధమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

Read More : పాపం పసివాళ్లు : గోడసందులో ఇరుక్కున్నారు