Shiv Sena: మళ్లీ బీజేపీ గూటికి శివసేన? అనుమానాల్ని రేకెత్తిస్తున్న సంజయ్ రౌత్ వ్యాఖ్యలు

బీజేపీతో పోటీ చేసి, విడిపోయి.. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది శివసేన. ఆ తర్వాత బీజేపీపై శివసేన చేసిన వ్యాఖ్యలు, అందునా సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు అంతా ఇంతా కాదు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టై జైలుకు వెళ్లేప్పుడు సైతం తీవ్ర గర్జనలతో వెళ్లిన రౌత్.. ఇలా జైలు నుంచి వచ్చీ రాగానే బీజేపీపై పొగడ్తలు కురిపిస్తుంటే సహజంగానే అనేక అనుమానాలు వస్తాయి.

Shiv Sena: మళ్లీ బీజేపీ గూటికి శివసేన? అనుమానాల్ని రేకెత్తిస్తున్న సంజయ్ రౌత్ వ్యాఖ్యలు

Is shiv sena tie up with bjp, what says sanjay raut

Shiv Sena: శివసేన మళ్లీ బీజేపీతో దోస్తీ కట్టనుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యలు చూస్తే. బుధవారం జైలు నుంచి విడుదలైన ఆయన.. ఉన్నట్టుండి భారతీయ జనతా పార్టీపై సానుకూలంగా స్పందించారు. అంతేనా.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‭పై ప్రశంసలు కురిపించారు. జైలుకు వెళ్లే వరకు, ఆ తర్వాత బీజేపీపై కత్తి దూసిన సంజయ్ రౌత్.. ఉన్నట్టుండి ఇలా యూటర్న్ తీసుకోవడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ఈరోజు నేను ఉద్ధవ్ థకరే, శరద్ పవార్‭లను కలుసుకుంటాను. ఈ రెండు-మూడు రోజుల్లో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‭ను కూడా కలుసుకుంటాను. అలాగే ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కలుసుకుంటాను. నాకు ఎవరి మీద ఫిర్యాదులు లేవు. మేము ఎలాంటి రాజకీయ పక్షపాతం చూడటం లేదు. ఏ కేంద్ర దర్యాప్తు సంస్థల్ని నిందించాలని అనుకోవడం లేదు’’ అని రౌత్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘మహారాష్ట్రలో ఏర్పడ్డ నూతన ప్రభుత్వాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫడ్నవీస్ నేతృత్వంలో రాష్ట్రం బాగానే నడుస్తోందని మేము అనుకుంటున్నాము’’ అని అన్నారు.

గత కొంత కాలంగా మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని మలుపులు, మార్పులు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. 2019లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం నాటి నుంచి అయితే రాజకీయాల్లో ఉన్న అనిశ్చితి, అస్థిరత స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఏ పార్టీ ఏ సమయంలో ఎటు వైపు వెళ్తుందో ఎవరికీ తెలియడం లేదు. ముఖ్యంగా శివసేన పార్టీ విషయంలో అయితే అనేక గందరగోళం ఉంది. బీజేపీతో పోటీ చేసి, విడిపోయి.. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది శివసేన. ఆ తర్వాత బీజేపీపై శివసేన చేసిన వ్యాఖ్యలు, అందునా సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు అంతా ఇంతా కాదు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టై జైలుకు వెళ్లేప్పుడు సైతం తీవ్ర గర్జనలతో వెళ్లిన రౌత్.. ఇలా జైలు నుంచి వచ్చీ రాగానే బీజేపీపై పొగడ్తలు కురిపిస్తుంటే సహజంగానే అనేక అనుమానాలు వస్తాయి.

Assam: డిసెంబర్ 1లోపు అన్ని వివరాలు ఇవ్వాలి.. ప్రైవేటు మదర్సాలకు ప్రభుత్వం ఆదేశం