Kerala: బీజేపీకి మద్దతు ఇస్తామన్న ఆ చర్చి.. క్రైస్తవులకు దగ్గరవ్వాలనుకున్న బీజేపీకి లక్కీ ఛాన్స్

అట్టడుగు స్థాయి సమాజాన్ని ఇబ్బంది పెట్టే సహజ రబ్బరు ధరల పతనం, పెరుగుతున్న మానవ-జంతు సంఘర్షణ, రక్షిత అటవీ ప్రాంతాలకు బఫర్ జోన్‌ల సరిహద్దులను నిర్ణయించడం వంటి ఆందోళనల నేపథ్యంలో బీజేపీయే ఒక మెట్టు దిగివచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలోని చర్చిలు, అందునా రాష్ట్రంలో శక్తివంతమైన కేరళ కాథలిక్ బిషప్స్ కౌన్సిల్స్.. వ్యవసాయ పరమైన ఆందోళనలను హైలైట్ చేస్తున్నాయి.

Kerala: బీజేపీకి మద్దతు ఇస్తామన్న ఆ చర్చి.. క్రైస్తవులకు దగ్గరవ్వాలనుకున్న బీజేపీకి లక్కీ ఛాన్స్

Kerala: కేరళలోని క్రైస్తవులకు దగ్గరవ్వాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న భారతీయ జనతా పార్టీకి లక్కీ ఛాన్స్ దక్కింది. సైరో-మలబార్ క్యాథలిక్ చర్చి ఆ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేసింది. దీంతో క్రైస్తవ సమాజంలోకి ప్రవేశించాలనే బీజేపీకి మంచి ఊపు వచ్చినట్టైంది. అయితే ఈ మద్దతు మీద సదరు చర్చి ఒక షరతు విధించింది. రాష్ట్రంలోని రబ్బరు రైతుల పరిస్థితిని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బీజేపీకి మద్దతిస్తామని హామీ ఇచ్చింది. కేరళలోని క్రైస్తవులతో చర్చలు కొనసాగుతాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చెప్పిన ఒక రోజు అనంతరమే ఈ వ్యాఖ్యలు రావడం విశేషం. కేరళలోని క్రైస్తవ సమాజం ఇకపై ఆర్ఎస్ఎస్‭కి భయపడదని.. క్రైస్తవులతో చర్చల కోసం రాష్ట్ర, జిల్లా స్థాయి యంత్రాంగాలను ఏర్పాటు చేసినట్లు సంఘ్ తెలిపింది.

Khalistan Row: ఇక చాలు.. పంజాబ్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన సిక్కు సంఘాలు

కాథలిక్ లేమెన్ అసోసియేషన్ ఆల్ కేరళ కాథలిక్ కాంగ్రెస్, కన్నూర్‌లో ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో చర్చి ఆర్చ్ బిషప్ జోసెఫ్ పాంప్లానీ మాట్లాడుతూ “రబ్బరు ధరలు పడిపోయాయి. దానికి బాధ్యులెవరు? కేంద్రాన్ని పాలించే పార్టీ అనుకూలమైన వైఖరి తీసుకుంటే కిలో ధర రూ.250కి పెంచవచ్చు. ప్రజాస్వామ్యంలో నిరసన అనేది ఓటుగా మారినప్పుడే ఆ ఓటు మరింత శక్తివంతమైందని మనం అర్థం చేసుకోవాలి. మీరు (కేంద్ర ప్రభుత్వం) రైతుల నుంచి కిలో రూ. 300 చొప్పున రబ్బర్ కొంటే, మీ పార్టీ ఏదయినా, మీకు ఓటు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము” అని అన్నారు. రబ్బరుతో పాటు వ్యవసాయోత్పత్తుల ధరల పతనానికి నిరసనగా, రైతులపై వన్యప్రాణుల దాడులను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని రైతాంగం అలకోడ్‌లో సమావేశం నిర్వహించింది. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు రైతులు ఆందోళన విరమించేది లేదని ఆర్చ్ బిషప్ తెలిపారు. “మేము ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కానీ ఇక్కడ రైతుల ధీన స్థితి మీద ప్రభుత్వ యత్రాంగం దృష్టి సారించాలి” అని ఆయన అన్నారు.

Bihar: బిహార్ సీఎం నితీశ్ కుమార్‭పై హార్స్ ట్రేడింగ్ ఆరోపణలు చేసిన ఓవైసీ

వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు, కేరళలో క్రైస్తవ ఓటు బ్యాంకుకు బీజేపీకి పెద్దపీట వేస్తోంది. రాష్ట్రం ఉల్లంఘించలేనిది కాదని నిరూపించడానికి ఇది క్రైస్తవ ఓట్ల భాగాన్ని, ముఖ్యంగా సంఖ్యాపరంగా బలమైన క్యాథలిక్‌లను తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అట్టడుగు స్థాయి సమాజాన్ని ఇబ్బంది పెట్టే సహజ రబ్బరు ధరల పతనం, పెరుగుతున్న మానవ-జంతు సంఘర్షణ, రక్షిత అటవీ ప్రాంతాలకు బఫర్ జోన్‌ల సరిహద్దులను నిర్ణయించడం వంటి ఆందోళనల నేపథ్యంలో బీజేపీయే ఒక మెట్టు దిగివచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలోని చర్చిలు, అందునా రాష్ట్రంలో శక్తివంతమైన కేరళ కాథలిక్ బిషప్స్ కౌన్సిల్స్.. వ్యవసాయ పరమైన ఆందోళనలను హైలైట్ చేస్తున్నాయి.