అంతా యూనియన్లే చేశాయి : ఆర్టీసీ సమ్మెపై కీలక ప్రకటన..

  • Published By: madhu ,Published On : November 28, 2019 / 02:29 PM IST
అంతా యూనియన్లే చేశాయి : ఆర్టీసీ సమ్మెపై కీలక ప్రకటన..

ఆర్టీసీ ముగింపు పలకాలని తమ ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని.. అసంబద్ధమైన డిమాండ్లతో అనాలోచితంగా సమ్మె చేశారని.. పూర్తి బాధ్యత వారిదేనని తెలంగాణ సీఎం కేసీఆర్..స్పష్టం చేశారు. అర్థం, పర్థం లేకుండా పలు పార్టీలు వ్యాఖ్యానిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలనుద్దేశించి వ్యాఖ్యానించారు. 2019, నవంబర్ 28వ తేదీ మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ జరిగింది. సుమారు.. ఐదున్నర గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. 

సమ్మె విషయంలో కార్మికులకు బాధ్యతతో చెప్పడం జరిగిందన్నారు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ప్రజల పొట్టలను నింపినం.. కానీ.. ఎవరి పొట్టలు కొట్టడం లేదన్నారు. అధికంగా జీతాలు పొందుతున్న వారు… ఎక్కడ ఉన్నారంటే.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారన్నారు. ఆర్టీసీ కార్మికులు యూనియన్ల మాటలో పెడబారిన పడుతున్నారని దీనివల్ల సంస్థతో పాటు వారి జీవితాలు నాశనమౌతుందన్నారు.

లేబర్ కోర్టుకు రిఫర్ చేయాలని హైకోర్టు చెప్పడం జరిగిందని, తమకు ఇంకా టైం ఉందన్నారు. ఇల్లీగల్ స్ట్రైక్‌లో ఉన్నారని, కార్మికుల గురించి ఆలోచించి వారిలో ఉన్నారంటే.. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం కార్మికులను ఎవరు కాపాడుతారని ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రైవేటు చేస్తామని.. అతీ గతీ లేకుండా.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. 
Read More : దెబ్బతిన్న రోడ్లకు రూ. 571 కోట్లు – సీఎం కేసీఆర్