Ambati Rambabu : సింగిల్‌గా పోరాడటం ఎలానో జగన్‌ను చూసి నేర్చుకో, టీడీపీలో విలీనం చేసేయ్- పవన్‌కు మంత్రి సలహా

Ambati Rambabu : చేగువేరా పేరు చెప్పుకుని తిరిగే నువ్వు ఒంటరిగా పోరాడలేనని సిగ్గు లేకుండా చెబుతున్నావ్. బట్టలు చించుకునే జన సైనికులు..

Ambati Rambabu : సింగిల్‌గా పోరాడటం ఎలానో జగన్‌ను చూసి నేర్చుకో, టీడీపీలో విలీనం చేసేయ్- పవన్‌కు మంత్రి సలహా

Ambati Rambabu

Ambati Rambabu Slams Pawan Kalyan : ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఎన్నికల పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన మాటలు మంటలు రేపాయి. వైసీపీని ఓడించటమే లక్ష్యం, కచ్చితంగా పొత్తులు ఉంటాయి అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. పవన్, జనసేన టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు.

రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి అనే దానికి పవన్ పెద్ద ఉదాహరణ అని అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ కోసమే పవన్ పార్టీ పెట్టినట్లు మేము ముందు నుండీ చెబుతున్నామన్నారు. వైసీపీ నుండి అధికారం లాక్కుని చంద్రబాబుకి ఇవ్వటమే పవన్ లక్ష్యం అన్నారు.(Ambati Rambabu)

Pawan Kalyan : టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే పోటీ- పొత్తులపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన

” నిన్న సీఎం పదవి వద్దు, నేను అడగను అన్నాడు. ఈరోజు ఎన్నికలు అయ్యాక చూద్దాం అంటున్నాడు. తిని తొంగుంటే ఓటింగ్ శాతం పెరుగుద్దా.? 24 గంటలూ ప్రజల్లో ఉంటే అంతంత మాత్రంగా ఉంటుంది. పార్ట్ టైమ్ రాజకీయాలు చేసే నీకెందుకు ఓటింగ్ పెరుగుతుంది? సింగిల్ గా వెళ్తే ఓడిపోయే పవన్ వెంట కాపులు ఎందుకు వెళ్తారు? చంద్రబాబు కోరిక తీర్చడానికి కాపులను తాకట్టు పెట్టడానికి పవన్ సిద్ధమైపోయాడు.

చంద్రబాబు దగ్గర ఫుల్ ప్యాకేజీ తీసుకునే మద్దతిస్తున్నాడు. చంద్రబాబు ముష్టి వేస్తే ఎత్తుకునే నీచ స్థాయికి దిగజారిపోయాడు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న సకలకళాకోవిదుడు ఇంకెవరైనా ఉంటారా..? చంద్రబాబుతో ఏ డీల్ కుదిరిందో పవన్ కళ్యాణ్ చెప్పాలి. చంద్రబాబు విసిరిన సీట్లు ఏరుకోవడానికి సిద్ధమయ్యాడు.(Ambati Rambabu)

చంద్రబాబుని సీఎం చెయ్యడానికి కాపులు పెద్దన్న పాత్ర ఎందుకు పోషించాలి? చంద్రబాబు కాపులను హింసించినప్పుడు పవన్ ఎక్కడ తొంగున్నాడు. ఆనాడు ముద్రగడకు, కాపులకు సీఎం జగన్ అండగా ఉన్నారు. టీడీపీ కాపు వ్యతిరేక పార్టీ. అలాంటి కాపులను చంద్రబాబు దొడ్డిలో కట్టాలని పవన్ చూస్తున్నారు. టీ, కాఫీ అలవాటు లేని వంగవీటి రంగాకి టీ ఇచ్చానని చెప్పారు.

Also Read..Jogi Ramesh : నీకు దమ్ము, ధైర్యం ఉంటే సింగిల్‌గా 175 స్థానాల్లో పోటీ చేయ్- పవన్ కల్యాణ్‌కి మంత్రి జోగి రమేశ్ సవాల్

చేగువేరా పేరు చెప్పుకుని తిరిగే పవన్.. ఒంటరిగా పోరాడలేనని సిగ్గు లేకుండా చెప్తున్నారు. చంద్రబాబు అంత మోసకారి, పవన్ అంత అబద్దాలకోరు దేశంలోనే ఎవరూ లేరు. బట్టలు చించుకునే జన సైనికులు ఇకపై సీఎం చంద్రబాబు అనాలి. సింగిల్ గా పోరాడటం జగన్ ను చూసి నేర్చుకో పవన్. రాజకీయాలు కుదరకపోతే సినిమాలు చేసుకో. నీకెందుకు రాజకీయాలు?(Ambati Rambabu)

ఈరోజు నిజమైన ప్యాకేజ్ స్టార్ అయ్యావు. జగన్ నుండి అధికారం లాక్కునే శక్తి పవన్ కు లేదు. లోకేశ్ పాదయాత్ర కోసం వారాహిని లోపల పెట్టేశారు. ఈ డొంక తిరుగుడు ఎందుకు? జనసేన పార్టీని టీడీపీలో విలీనం చేసేయండి” అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.