ఏపీలో ఎమ్మెల్సీ జాతర : ఎమ్మెల్యేగా మంత్రి నారాయణ పోటీ 

ఏపీలో మార్చి నెలాఖరులోగా 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగునున్నాయి. 

  • Published By: veegamteam ,Published On : January 11, 2019 / 08:17 AM IST
ఏపీలో ఎమ్మెల్సీ జాతర : ఎమ్మెల్యేగా మంత్రి నారాయణ పోటీ 

ఏపీలో మార్చి నెలాఖరులోగా 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగునున్నాయి. 

అమరావతి : ఏపీలో ఎమ్మెల్సీ జాతర మొదలైంది. మార్చితో 8 మంది ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తి కానుంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ మరణంతో మరో సీటు ఖాళీ అయింది. మొత్తం 9 స్థానాలకు ఖాళీ అవుతున్నాయి. మార్చి నెలాఖరులోగా 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగునున్నాయి. ఈసారి పదవీకాలం ముగుస్తున్న వారిలో మంత్రలు యనమల రామకృష్ణడు, నారాయణ ఉన్నారు. ఎమ్మెల్సీగా మరోసారి యనమల రామకృష్ణుడికి ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మంత్రి నారాయణ మాత్రం ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలని ఉవ్విళ్లూరుతున్నారు. నారాయణ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటున్నారు. నెల్లూరు అర్బన్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆయనకు పార్టీ అధిష్టానం నుంచి అనుమతి లభించిందని సమాచరం. ఎక్కువగా నెల్లూరు అర్బన్ లో ఉంటూ రాజకీయంగా పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. యనమల, నారాయణ ఎమ్మెల్సీ కోటా నుంచి మంత్రులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

ఇప్పటివరకు ఎమ్మెల్యే సీట్లపై కన్నేసిన నాయకులంతా ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్లపై కన్నేశారు. ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయన్న సమాచారం బయటికి పొక్కడంతో ఎవరికి వారు ఎమ్మెల్సీ సీటును దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేల కోటాలో మార్చి నెలలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, శివకుమారి, ఆదిరెడ్డి, అప్పారావుల పదవీకాలం ముగియనుంది. 

పార్టీ బలాబలాలను బట్టి అధికార పార్టీకి నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు రానున్నాయి. బీసీ నేత యనమల రామకృష్ణుడికి ఎమ్మెల్సీ సీటు కన్ఫార్మ్ అయింది. మరో మూడు స్థానాల్లో అధికార పార్టీ ఎమ్మెల్సీ సీట్లు పొందే అవకాశం ఉంది. ఎంవిఎస్ మూర్తి అమెరికాలో దుర్మరణం చెందారు. ఆయన మరణంతో వైజాగ్ లోకల్ బాడీ నుంచి స్థానం ఖాళీ అయింది. ఈ స్థానాన్ని ఒక నేతకు ఇచ్చే అవకాశం ఉంది. టీడీపీకి ఎమ్మెల్సీ కోటా కింద వచ్చే మూడు స్థానాలను ఎవరికి ఇవ్వాలన్న అంశంపై పార్టీలో చర్చిస్తున్నారు. అసెంబ్లీ సీట్లు ఆశించే నేతలను  బుజ్జగించి ఎమ్మెల్సీ సీటు ఇచ్చే అవకాశం ఉంది. ప్రొద్డుటూరులో నేతల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. వారికి ఎమ్మెల్సీ స్థానాలను ఇచ్చే అవకాశం ఉంది.