నరసరావుపేట పంచాయతీ: చంద్రబాబుకి తలనొప్పిగా కోడెల

ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపికపై అన్ని రాజకీయ పార్టీల అధినేతలు ఫోకస్ పెట్టారు. అభ్యర్థుల ఎంపికను ముమ్మరం చేశారు. కొన్ని చోట్ల సీట్ల సర్దుబాటు

  • Published By: veegamteam ,Published On : March 12, 2019 / 09:50 AM IST
నరసరావుపేట పంచాయతీ: చంద్రబాబుకి తలనొప్పిగా కోడెల

ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపికపై అన్ని రాజకీయ పార్టీల అధినేతలు ఫోకస్ పెట్టారు. అభ్యర్థుల ఎంపికను ముమ్మరం చేశారు. కొన్ని చోట్ల సీట్ల సర్దుబాటు

ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపికపై అన్ని రాజకీయ పార్టీల అధినేతలు ఫోకస్ పెట్టారు. అభ్యర్థుల ఎంపికను ముమ్మరం చేశారు. కొన్ని చోట్ల సీట్ల సర్దుబాటు తలనొప్పిగా మారింది. నరసరావుపేట ఎంపీ అభ్యర్థి ఎంపిక టీడీపీ అధినేత చంద్రబాబుకి సమస్యగా మారింది. స్పీకర్ కోడెల శివప్రసాద్ ను నరసరావుపేట లోక్ సభ ఎన్నికల బరిలో దింపాలని చంద్రబాబు భావిస్తున్నారు. కోడెల లోక్ సభ నుంచి పోటీ చేస్తే పార్టీకి ప్రయోజనకరంగా ఉంటుందని చంద్రబాబు యోచిస్తున్నారు. కోడెల మాత్రం ఎంపీగా పోటీ చేసేందుకు ససేమిరా అంటున్నారు.
Read Also : ముహూర్తం ఫిక్స్ : వైసీపీని ఓడించటమే లక్ష్యం.. వంగవీటి రాధా

తాను సత్తెనపల్లి అసెంబ్లీ బరిలోనే ఉంటానని చంద్రబాబుకి తేల్చి చెప్పారు. ఆయనకు టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా లేని చంద్రబాబు.. రాయపాటి రంగబాబును సత్తెనపల్లి నుంచి బరిలోకి దింపాలని చూస్తున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక నరసరావు పేట నుంచి తాను పోటీ చేస్తానని రాయపాటి సాంబశివరావు చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నారు.
Read Also : బాపట్ల వైసీపీలో విభేదాలు : కోన v/s చీరాల గోవర్థన్ రెడ్డి

ఒకే సీటుకి ఇద్దరు ముగ్గురు పోటీ పడుతుండటంతో చంద్రబాబుకి తలనొప్పిగా మారింది. నేతలకు ఎలా నచ్చచెప్పాలో అర్థం కాక తలపట్టుకున్నారు. సీనియర్ నేతలను డీల్ చేయడం చంద్రబాబుకి ఇబ్బందిగా మారింది. అందరూ ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానంటే ఎలా అని చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. నరసరావు పేట ఎంపీ టికెట్ పంచాయతీని చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారో చేస్తారో చూడాలి.
Read Also : వైసీపీ మమ్మల్ని నిలువునా ముంచేసింది : తిప్పారెడ్డి భార్య