ఎన్టీఆర్‌లా అది అందరికీ సాధ్యం కాదు

ఆదివారం(ఫిబ్రవరి 16,2020) నియోజకవర్గాల వారీగా జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానం పరిధిలోని జన సైనికులతో భేటీ అయిన

  • Published By: veegamteam ,Published On : February 16, 2020 / 12:30 PM IST
ఎన్టీఆర్‌లా అది అందరికీ సాధ్యం కాదు

ఆదివారం(ఫిబ్రవరి 16,2020) నియోజకవర్గాల వారీగా జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానం పరిధిలోని జన సైనికులతో భేటీ అయిన

ఆదివారం(ఫిబ్రవరి 16,2020) నియోజకవర్గాల వారీగా జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానం పరిధిలోని జన సైనికులతో భేటీ అయిన పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాలపై తన అభిప్రాయం చెప్పారు. రాజకీయాలు ఎలా ఉండాలో వివరించారు. కుల, ధన రాజకీయాలు అంతం కావాలని పవన్ ఆకాంక్షించారు. బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ రావాలని కోరుకున్నారు. తాను జనసేన పార్టీ పెట్టడానికి అదొక కారణం అన్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో డబ్బు ప్రభావం బాగా కనిపించిందన్నారు. ఆ ఎన్నికల్లో ఓడినవాళ్లు ఓపెన్ గా ఏడిస్తే, గెలిచిన వాళ్లు ఇంటికెళ్లి ఏడ్చారని ఎద్దేవా చేశారు. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా టీడీపీకి ఓటమి తప్పలేదన్నారు. అన్ని చోట్ల ఓటర్లను డబ్బుతో కొనలేరన్న దానికి ఇటీవల ఢిల్లీలో ఆప్ విజయమే నిదర్శనమని పవన్ చెప్పారు.

అనంతరం రేపల్లె నియోజకవర్గ కార్యకర్తలో భేటీ అయిన పవన్.. పార్టీ పెట్టగానే అధికారంలోకి రావడం ఎన్టీఆర్ లా అందరికీ సాధ్యం కాదన్నారు. అప్పటి పరిస్థితుల కారణంగా పార్టీ పెట్టగానే అధికారంలోకి రావడం ఎన్టీఆర్ కు సాధ్యమైందన్నారు. ఇప్పటి పరిస్థితుల్లో అది అసాధ్యమన్నారు. తాను మాత్రం దూరదృష్టితోనే జనసేన స్థాపించానని పవన్ చెప్పారు. బాధ్యత గల రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాల్లో ఓటమి అనేది సహజం అన్న పవన్..ఓటమికి కుంగిపోయే వ్యక్తిని కాదన్నారు.

తనకు రెండు చోట్ల నుంచి పోటీ చేయడం ఇష్టం ఉండదన్న పవన్ కళ్యాణ్.. పార్టీ నేతలు చెప్పడంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీకి దిగానన్నారు. 2019 ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేయాలని కొందరు చెప్పినా.. కుదరలేదన్నారు. ఈసారి తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తానని పవన్ చెప్పారు. ఈజీగా గెలవాల్సిన సీటు తాడేపల్లిగూడెం అన్నారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలతో 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఈసారి పవన్ తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేస్తారనే చర్చ మొదలైంది. తాను ఎక్కడి నుంచి పోటీ చేసే స్థానం గురించి పవన్ పరోక్షంగా హింట్ ఇచ్చారా అని డిస్కస్ చేసుకుంటున్నారు.

కుల, మతాల ఆధారంగా దేశం, రాష్ట్రం విచ్చిన్న అవడం కరెక్ట్ కాదన్నారు పవన్. వైసీపీకి ఓట్లు వేసిన వాళ్లకు కూడా పనులు జరగడం లేదని ఆరోపించారు. అదేమిటని అడిగితే.. డబ్బు తీసుకుని ఓట్లేశారని చెబుతున్నారని అన్నారు. పథకాల ద్వారా మళ్లీ గెలవాలని వైసీపీ భావిస్తే అది భ్రమే అవుతుందన్నారు. గతంలో ఇదే విధంగా పథకాలు ప్రవేశపెట్టిన టీడీపీకి ఓటమి తప్పలేదని పవన్ గుర్తు చేశారు. రేషన్ కార్డులు, పించన్ల తొలగింపుతో వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని పవన్ అన్నారు. మిత్రపక్షం బీజేపీతో కలిసి ప్రణాళిక సిద్ధం చేస్తామని, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని పవన్ చెప్పారు.