Sanjay Raut: సావర్కర్ మీద సవాళ్లు వద్దంటూ రాహుల్‭ను కలవనున్న రౌత్

రాహుల్ ‘సావర్కర్’ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై శివసేన (యుబిటి) నాయకుడు ఉద్దవ్ ఠాక్రే (Uddhav Thackeray) తీవ్రంగా స్పందించారు. వినాయక్ సావర్కర్ ను అవమానించవద్దంటూ రాహుల్ గాంధీకి హెచ్చరికలు చేశారు. హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ ను తాను, తన ఆరాధ్యదైవంగా భావిస్తున్నానని, ఆయన్ను అవమానించడం మానుకోవాలని రాహుల్ కు ఉద్దవ్ ఠాక్రే సూచించారు

Sanjay Raut: సావర్కర్ మీద సవాళ్లు వద్దంటూ రాహుల్‭ను కలవనున్న రౌత్

Sanjay Raut to meet Rahul Gandhi, ask him to avoid criticising Savarkar after Uddhav’s warning

Sanjay Raut: సారీ చెప్పడానికి తాను సావర్కర్ (Savrkar) కానంటూ కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై ఉద్ధవ్ థాకరే వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సావర్కర్ తమకు దేవుడిలాంటి వాడని, ఆయనను అవమానించే విధంగా వ్యాఖ్యానించొద్దంటూ సామ్నా ఎడిటోరియల్‭లో ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) హెచ్చరించారు. రాహుల్ గాంధీ మీద వేసిన అనర్హత వేటు అప్రజాస్వామికమని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి తాము పోరాడుతున్నామని, అయితే హిందుత్వ సిద్ధాంతకర్త సావర్కర్ మీద విమర్శలు మానుకోవాలని సూచించారు.

Uttar Pradesh: యూపీలో దారుణం..10ఏళ్ల బాలుడ్ని నరబలి ఇచ్చిన బంధువు.. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు..

అయితే ఇదే విషయమై సంజయ్ రౌత్ (Sanjay Raut) తొందరలో రాహుల్ గాంధీని కలవనున్నారు. పలు సందర్భాల్లో సావర్కర్ మీద రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీతో ఉద్ధవ్ వర్గం (యూటీడీ) మిత్రపక్షంగా ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్‭ని కలిసి భవిష్యత్తులో సావర్కర్ మీద వ్యతిరేక వ్యాఖ్యలు చేయద్దని రౌత్ కోరనున్నరు. ఈ విషయమై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ ‘‘అది పూర్తిగా తప్పుడు ప్రకటన. ఆయన గాంధీయే, కానీ సావర్కర్ పేరును అలా మధ్యలోకి తేవడం సరికాదు. సావర్కర్ మాకు స్ఫూర్తి. ఛత్రపతి శివాజీ మహరాజ్ ఎంతనో వీడీ సావర్కర్ కూడా అంతే. నేను ఈ విషయం తొందరలోనే రాహుల్ గాంధీతో మాట్లాడతాను’’ అని అన్నారు.

Manda Krishna Madiga: డాక్టర్ అచ్చెన్న హత్యలో కిరాయి హంతకుల పాత్ర ఉంది: మందకృష్ణ మాదిగ

రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్‌సభ అభ్యర్థిత్వంపై అనర్హత వేటు పడిన విషయం విధితమే. పరువు నష్టం కేసు (Defamation case) లో గుజరాత్‌లోని సూరత్ కోర్టు రాహుల్‌కు రెండేండ్లపాటు జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఆ తరువాతి రోజే లోక్‌సభ సచివాలయం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. బెదిరింపులు, జైలు శిక్షలకు భయపడేది లేదని, ప్రశ్నించడం ఆపేది లేదని రాహుల్ అన్నారు. తానెప్పుడూ క్షమాపణలు చెప్పనని, నేను సావర్కర్ (Savarkar) కాదు.. నా పేరు గాంధీ. గాంధీ ఎవరినీ క్షమాపణలు అడగరు అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.

Black Protest: కాంగ్రెస్ పార్టీ నిరసనలో సడెన్ ఎంట్రీ ఇచ్చిన తృణమూల్ కాంగ్రెస్

రాహుల్ ‘సావర్కర్’ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై శివసేన (యుబిటి) నాయకుడు ఉద్దవ్ ఠాక్రే (Uddhav Thackeray) తీవ్రంగా స్పందించారు. వినాయక్ సావర్కర్ ను అవమానించవద్దంటూ రాహుల్ గాంధీకి హెచ్చరికలు చేశారు. హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ ను తాను, తన ఆరాధ్యదైవంగా భావిస్తున్నానని, ఆయన్ను అవమానించడం మానుకోవాలని రాహుల్ కు ఉద్దవ్ ఠాక్రే సూచించారు. అంతేకాదు, పదేపదే సావర్కర్ ను కించపర్చడం ద్వారా విపక్ష కూటమిలో విబేధాలు వస్తాయని, అది బీజేపీకి బలాన్ని చేకూర్చుతుందని అన్నారు.