Congress chief: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టాలని రాహుల్ గాంధీపై ఒత్తిడి తీసుకువస్తాం: మల్లికార్జున ఖర్గే

ఇవాళ  మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాలనుకుంటోన్న నేత గురించి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్ వరకు ప్రజలకు తెలిసి ఉండాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆ నేతను నాయకుడిగా అంగీకరించాల్సి ఉంటుందని అన్నారు. పార్టీలో రాహుల్ మినహా అటువంటి నేత ఎవరూ లేరని చెప్పారు. రాహుల్ గాంధీకి ప్రత్యామ్నాయ నాయకుడు ఎవరు ఉన్నారని ఆయన ప్రశ్నించారు.

Congress chief: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టాలని రాహుల్ గాంధీపై ఒత్తిడి తీసుకువస్తాం: మల్లికార్జున ఖర్గే

Congress chief

Congress chief: కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీని మరింత ఇరకాటంలో పెడుతున్నాయి. ఏఐసీసీ తదుపరి అధ్యక్షుడి అంశం, పార్టీలో విభేదాలు, ఆజాద్ వంటి నేతల రాజీనామా, తదితర అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు రాహుల్ గాంధీ మళ్ళీ విముఖత వ్యక్తం చేశారని, త్వరలోనే గాంధీ-నెహ్రూ కుటుంబేతర నేతను కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకుంటారని ప్రచారం జరుగుతోంది. దీంతో, కాంగ్రెస్ పార్టీ పగ్గాలను ఎవరు చేపడతారన్న సందిగ్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడు ఎవరనేదానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఆ బాధ్యతలు స్వీకరించాలని రాహుల్ గాంధీపై ఒత్తిడి తీసుకు వస్తామని ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే చెప్పారు.

ఇవాళ  మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాలనుకుంటోన్న నేత గురించి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్ వరకు ప్రజలకు తెలిసి ఉండాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆ నేతను నాయకుడిగా అంగీకరించాల్సి ఉంటుందని అన్నారు.

పార్టీలో రాహుల్ మినహా అటువంటి నేత ఎవరూ లేరని చెప్పారు. రాహుల్ గాంధీకి ప్రత్యామ్నాయ నాయకుడు ఎవరు ఉన్నారని ఆయన ప్రశ్నించారు. పార్టీ కోసం, దేశం కోసం, ఆర్ఎస్ఎస్-బీజేపీ కోసం, దేశాన్ని ఐక్యంగా ముందుకు నడిపించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టాలని రాహుల్ గాంధీని కోరతామని తెలిపారు. ‘జోడో భారత్’ కోసం ఆ బాధ్యతలు చేపట్టాలని ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు.

COVID 19: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. కొత్తగా 9,520 మందికి కరోనా