కన్నా స్థానంలో కాబోయే బీజేపీ చీఫ్ ఎవరు? కమ్మ వర్గానికి ఇస్తారా

ఒక పదవిలో ఒకే వ్యక్తిని ఏ పార్టీ కూడా కూర్చోబెట్టదు. అది జగమెరిగిన సత్యం.. ప్రాంతీయ పార్టీల్లోనే తప్ప.. జాతీయ పార్టీల్లో అది సాధ్యమయ్యే పని కాదు.. ఏపీ బీజేపీలో కూడా అదే

  • Published By: veegamteam ,Published On : March 17, 2020 / 05:07 AM IST
కన్నా స్థానంలో కాబోయే బీజేపీ చీఫ్ ఎవరు? కమ్మ వర్గానికి ఇస్తారా

ఒక పదవిలో ఒకే వ్యక్తిని ఏ పార్టీ కూడా కూర్చోబెట్టదు. అది జగమెరిగిన సత్యం.. ప్రాంతీయ పార్టీల్లోనే తప్ప.. జాతీయ పార్టీల్లో అది సాధ్యమయ్యే పని కాదు.. ఏపీ బీజేపీలో కూడా అదే

ఒక పదవిలో ఒకే వ్యక్తిని ఏ పార్టీ కూడా కూర్చోబెట్టదు. అది జగమెరిగిన సత్యం.. ప్రాంతీయ పార్టీల్లోనే తప్ప.. జాతీయ పార్టీల్లో అది సాధ్యమయ్యే పని కాదు.. ఏపీ బీజేపీలో కూడా అదే పరిస్థితి.. ఆయనేమో.. తననే కొనసాగిస్తారనే ఆశతో ఉన్నారు. అక్కడేమో వేరే సమీకరణాలు, లెక్కలు వేసే పనిలో ఢిల్లీ పెద్దలున్నారు. ఇంకేముంది.. ఈసారి కొత్త ముఖాన్ని తెర మీదకు తీసుకు రావడం ఖాయమనే టాక్‌ వినిపిస్తోంటే.. ఆయనలో మాత్రం తెలియని టెన్షన్‌ మొదలైంది.

స్థానిక ఎన్నికలపై పెద్దగా ఆశల్లేని బీజేపీ:
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిని మార్చడంపై పార్టీ అధినాయకత్వంలో చర్చ జరుగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను మార్చడమనేది చాలా రోజులుగా పార్టీలో చర్చనీయాంశంగానే ఉంది. అయితే, ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారనే విషయం మాత్రం తేలడం లేదట. ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వాతావరణం వేడిగా ఉంది. బీజేపీకి ఈ ఎన్నికల మీద పెద్దగా ఆశల్లేవు. పోటాపోటీగా బరిలోకి దిగాలనే సంకల్పాలు కూడా పెద్దగా లేవు. కాకపోతే.. గ్రామ స్థాయిలో అంతో ఇంతో గుర్తింపు పొందడం ద్వారా భవిష్యత్తు రాజకీయాల్లో పట్టు పెంచుకోవడానికి ఉపయోగ పడుతుందనే అభిప్రాయం మాత్రం పార్టీలో ఉంది. అందుకే కొందరు పోటీకి సై అంటున్నారట. 

కాపులను ఆకర్షించేందుకు పవన్ ఉన్నాడని ధీమా:
ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడే కన్నా లక్ష్మీనారాయణను మార్చే నిర్ణయం వెలువడకపోవచ్చని అంటున్నారు. ఎన్నికల తర్వాత మాత్రం ఏపీ బీజేపీ చీఫ్‌గా కొత్త నేత వస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ ఎంపికలో బీజేపీ కుల సమీకరణలకు పెద్దపీట వేయనుందని అంటున్నారు. రాష్ట్రంలో రెడ్డి, కమ్మ కులాలు రెండు పెద్ద పార్టీలను ఓన్ చేసుకున్న సమయంలో.. మరో ప్రధాన కులం కాపును చేరదీసినట్లుగా కనిపించడానికి బీజేపీ కన్నా లక్ష్మీనారాయణకు పదవి ఇచ్చింది. ఇప్పుడు కాపు ఓటు బ్యాంకును తమవైపు ఆకర్షించడానికి ఏకంగా పవన్ కల్యాణే తమ అమ్ములపొదిలో ఉన్నారని భావిస్తోంది. ఇక వారికి కాపు కార్డు అక్కర్లేదట. కానీ.. అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారిలో సోము వీర్రాజు, మాణిక్యాల రావు వంటి వారు ఆ వర్గానికి చెందిన ప్రముఖులే. 

కమ్మ సామాజిక వర్గం నుంచే పదవిని ఆశిస్తున్న వారెక్కువ:
ప్రస్తుతం కాపుల చేతిలో ఉన్న పదవిని మరో సామాజికవర్గానికి కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. నిజానికి ఇతర పార్టీల నుంచి కొత్త నీరు వచ్చి చేరిన తర్వాత.. కమ్మ వర్గం నుంచి ఆ పదవి ఆశించే వారు ఎక్కువ మందే ఉన్నారని అంటున్నారు. పురంధేశ్వరి, పీవీఎన్ మాధవ్, సోము వీర్రాజు, మాణిక్యాలరావు అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. సుజనా చౌదరి, సీఎం రమేష్ మద్దతిచ్చే వారికే ఈసారి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. స్థానిక ఎన్నికల తర్వాత గానీ ఈ తతంగానికి ఫుల్‌స్టాప్‌ అవకాశం లేదంటున్నారు. మరి అధిష్టానం ఏం చేస్తుందో చూడాల్సిందే.

Also Read | కరోనా నిరోధక చర్యలపై బులెటిన్…సోషల్ మీడియాలో అసత్యప్రచారం చేస్తే కఠిన చర్యలు