ఎకో ఫ్రెండ్లీ గణపతి గిన్నీస్ రికార్డ్ : 2138 మంది మట్టి విగ్రహాల తయారీ

  • Published By: veegamteam ,Published On : August 29, 2019 / 08:45 AM IST
ఎకో ఫ్రెండ్లీ గణపతి గిన్నీస్ రికార్డ్ : 2138 మంది మట్టి విగ్రహాల తయారీ

కెమికల్..  ప్లాస్టిక్.. థర్మాకోల్ లతో తయారుచేసే వినాయకుడి విగ్రాహాలతో పర్యావరణానికి ఎంతగా హాని జరుగుతోంది. వీటి వల్ల మనిషి మనుగడనే ప్రమాదకరంగా మారుతోంది. ఇటువంటి విగ్రహాలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేయటమ కాదు హెచ్చరికలు కూడా ఇచ్చింది. అయినా ఎవ్వరూ
పట్టించుకోవటంలేదు. దీంతో చెరువులు, నదులు, సరస్సుల్లో నీటి కాలుష్యం పెరిగిపోతూనే ఉంది. వినాయక చవితి సందర్బంగా కాలుష్యాన్ని తగ్గించాలని, మట్టి విగ్రహాలనే పూజించాలనీ బెంగళూరు వాసులు దేశానికి సందేశం ఇస్తున్నారు. ఒకే వేదికపై భారీ సంఖ్యలో వినాయకుడి మట్టి విగ్రహాలను తయారు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్
వరల్డ్ రికార్డ్ సాధించారు.  

బెంగళూరులోని నేషనల్ కాలేజీ గ్రౌండ్స్‌లో శ్రీ విద్యారణ్య యువక సంఘ, బెంగళూరు గణేష్ ఉత్సవ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం (ఆగస్టు 25, 2019) భారీ ఈవెంట్‌ను నిర్వహించారు. ఒకే వేదికపై 2వేల 138 మంది ఒకేసారి వినాయకుడి మట్టి విగ్రహాలను తయారు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పారు. గిన్నిస్ బుక్ ఆఫ్
వరల్డ్ రికార్డ్స్‌ కెక్కారు. గతంలో ఈ రికార్డు 589గా ఉంది. ఇప్పుడు చిన్నా, పెద్దా, ఆడ, మగ తేడా లేకుండా ఉత్సాహంగా పాల్గొని ఒకేసారి గణేషడి మట్టి విగ్రహాలను తయారు చేయడం విశేషం. అది గిన్నీస్ రికార్డ్ సాధించటం మరోవిశేషం. 

ఈ మట్టి విగ్రహాల తయారీకి పూర్తిగా సహజ సిద్ధమైన పదార్థాలనే ఉపయోగించారు. మట్టి, తులసి విత్తనాలు వంటి పదార్ధాలను వాడారు. పూజలు, భక్తి పేరుతో పర్యావరణానికి హాని కలిగించటం సరికాదంటున్నారు. పండుగలు మానవాళికి మంచి చేసేందుకు వచ్చాయి తప్ప.. ప్రకృతి వినాశానానికి కాదన్నారు నిర్వహకులు. లేదంటే మన చేతుల్తో మనమే భూమిని నాశనం చేసిన వారమవుతాం. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మట్టితో వినాయకుడినే పూజించి.. ప్రసన్నం చేసుకోవాలని కోరారు.