TTD : శ్రీ వారికి పుష్పయాగం…8 టన్నుల పుష్పాలను సేకరించిన టీటీడీ

తిరుమల శ్రీవారి ఆలయంలో...పుష్పయాగానికి ఆలయ అర్చకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేదమూర్తులు, ఆలయ పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ఈ వేడుక జరుగనుంది.

TTD : శ్రీ వారికి పుష్పయాగం…8 టన్నుల పుష్పాలను సేకరించిన టీటీడీ

Pushpayagam 2021 In Tirumala Tirupati Balaji Temple

Pushpayagam 2021 : తిరుమల శ్రీవారి ఆలయంలో…పుష్పయాగానికి ఆలయ అర్చకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేదమూర్తులు, ఆలయ పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ఈ వేడుక జరుగనుంది. ఈ సందర్భంగా అంకురార్పణ జరుగనుంది. నైవేద్యం పూర్తయిన అనంతరం శ్రీదేవ, భూదేవి మలయప్ప స్వామి ఉత్సవ మూర్తులను కళ్యాణ మండపానికి తీసుకొస్తారు. అక్కడ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో పుష్పయాగం నిర్వహిస్తారు.

Read More : TTD LAC in Delhi : గోవును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే

సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించనున్నారు. నాలుగు మాడ వీధుల్లో మలయప్ప స్వామి ఊరేగుతూ…భక్తులకు దర్శనమివ్వనున్నారు. పుష్పయాగ మహోత్సవం సందర్భంగా..కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవాన్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.

Read More : Pak CJ Gulzar Ahmed : పాకిస్థాన్ లోని హిందువులకు అండగా ఉంటాం : పాక్ ప్రధాన న్యాయమూర్తి

పుష్పయాగానికి దాదాపు 8 టన్నుల పుష్పాలను సేకరించింది టీటీడీ. తమిళనాడు, కర్నాటక, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పుష్పాలను సేకరించారు. 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో స్వామి వారికి పుష్పయాగం నిర్వహించనున్నారు. కర్నాటక నుంచి నాలుగు టన్నులు, తమిళనాడు నుంచి మూడు టన్నుల, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి టన్ను పుష్పాలు తీసుకొచ్చారు. శ్రీవారికి 7 సార్లు పుష్పార్చన చేయనున్నారు. స్వామి వారి పాదాల నుంచి హృదయం వరకు పుష్పాలు, పత్రాలతో అర్చన నిర్వహించనున్నారు అర్చకులు.