Yadadri : శ్రావణమాసం, తొలి శనివారం యాదాద్రిలో ఫుల్ రష్

శ్రావణ శనివారం రోజు యాదాద్రి భక్తులతో కిక్కిరిసిపోయింది. తొలి శనివారం కావడంతో భారీగానే భక్తులు తరలివచ్చారు. యాదాద్రీశుడి దర్శనానికి బారులు తీరడంతో క్యూ లైన్లు నిండిపోయాయి. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని లఘు దర్శనానికి అనుమతినిస్తున్నారు. స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుండగా...ధర్మ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.

Yadadri : శ్రావణమాసం, తొలి శనివారం యాదాద్రిలో ఫుల్ రష్

Yadadri Temple

Sravana Masam : శ్రావణమాసాన్ని పవిత్ర మాసంగా భావిస్తుంటారు. ప్రత్యేక పూజలు, కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంటారు. శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజలు, వ్రతాలు చేస్తుంటారు. పసుపు, బొట్టు, కానుకలు ఇస్తుంటారు. దేవాలయాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇదిలా ఉంటే…ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి పునర్ నిర్మాణ పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. శ్రావణమాసం సందర్భంగా..రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొనేందుకు యాదాద్రికి వస్తున్నారు.

Read More : Lovers : పెళ్లికి నిరాకరించిన పెద్దలు.. కలిసి ఉండలేమని.. కారులోనే

2021, ఆగస్టు 14వ తేదీ శ్రావణ శనివారం రోజు యాదాద్రి భక్తులతో కిక్కిరిసిపోయింది. తొలి శనివారం కావడంతో భారీగానే భక్తులు తరలివచ్చారు. యాదాద్రీశుడి దర్శనానికి బారులు తీరడంతో క్యూ లైన్లు నిండిపోయాయి. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని లఘు దర్శనానికి అనుమతినిస్తున్నారు. స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుండగా…ధర్మ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్న కారణంగా..వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు.

Read More : Rashmi Gautam: ఒకప్పుడు అవకాశాలు తక్కువ.. ఇప్పుడలా కాదు

Talasani

ఇదిలా ఉంటే..యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సతీసమేతంగా దర్శించుకున్నారు. శనివారం ఉదయం యాదాద్రికి చేరుకున్న తలసాని కుటుంబానికి ఆలయ అధికారులు, పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం మంత్రి తలసాని దంపతులకు పండితులు వేదాశీర్వాదాలు అందచేశారు. స్వామి వారి తీర్థప్రసాదాలు అందించారు.