Kondagattu Anjanna : భక్తుల కొంగుబంగారం… కొండగట్టు అంజన్న

తిఏటా చైత్ర పౌర్ణమినాడు , వైఖాఖ బహుళ దశమినాడు హానుమాన్ చిన్నహనుమాన్, పెద్ద హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహిస్తారు. ఆంజన్న దీక్ష తీసుకుని లక్షలాది మంది స్వామివారిని దర్శించుకుంటారు.

Kondagattu Anjanna : భక్తుల కొంగుబంగారం… కొండగట్టు అంజన్న

Kondagattu Hanuman

Kondagattu Anjanna : దేశ వ్యాప్తంగా అనేక ఆంజనేయ క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో తెలంగాణా రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న కొండగట్టు ఆంజనేయస్వామి క్షేత్రం ఎంతో ప్రసిద్ధిగాంచింది. కొండలు, లోయలు, ప్రకృతి సౌందర్యాల నడుమ ఈ క్షేత్రం భాసిల్లుతుంది. ఈ క్షేత్రానికి సంబంధించి అనేక పురాగాణ గాధలు ఉన్నాయి. త్రేతాయుగంలో సంజీవని పర్వతంతో వెళుతున్న హనుమంతుడిని ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న ఋషులు ఆహ్వానించారట. అయితే లక్ష్మణుడి ప్రాణాలు కాపాడేందుకు సంజీవని పర్వతంతో వెళుతున్న హనుమంతుడు మళ్ళీ వస్తానని చెప్పి వేగంగా వెళ్ళిపోయాడట. అనంతర కాలంలో దుష్టశక్తులు ఋషులు దైవక్యార్యాలకు ఆటంకలిగించటం ప్రారంభించారు. ఆక్రమంలోనే ఋషులు తపస్సుతో హనుమంతుడు స్వయంభువుగా వెలిసాడట. అప్పటి నుండి ఋషులు తమ దైవకార్యాలను నిర్విఘ్నంగా కొనసాగించినట్లు పురాణా గాధలు చెబుతున్నాయి.

అదే తరహా మరో చరిత్ర కూడా ప్రాచుర్యంలో ఉంది.  400 సంవత్సరాల క్రితం కొడిమ్యాల అనే ప్రాంతంలో సంజీవుడు అనే యాదవుడు ఆవులు మేపుతూ ఉండగా అతని ఆవు తప్పిపోగా వెతకడం మొదలుపెట్టాడు. అలా కొండలు గుట్టలు ఎక్కుతూ అలిసిపోవడంతో ఓ పెద్ద చింతచెట్టు కింద నిద్రపోయాడు. ఆసమయంలో అతనికి కలలో ఆంజనేయస్వామి కనిపించి నేనిక్కడ కోరంద పొదలో ఉన్నాను. నాకు ఎండ, వాన, ముండ్ల నుండి రక్షణ కల్పించమని చెప్పటంతోపాటు అతను వెతుకుతున్న ఆవు జాడను చెప్పి అదృశ్యమయ్యాడు. అంతలో సంజీవుడు నిద్రనుంచి లేచి చూసేసరికి తన ఆవు కనిపించింది. ఆ తర్వాత స్వామి చెప్పిన స్థలానికి వెళ్లి చూడగా అక్కడ స్వామి వారు శంఖు చక్ర గదాలంకరణతో విశ్వరూపమైన పంచముఖాలలో ఒకటైన నారసింహ వక్త్రంతో ఉత్తరాభిముఖంగా కనిపించాడని ఇక్కడి స్థల పురాణం చెబుతుంది.

ప్రతిఏటా చైత్ర పౌర్ణమినాడు , వైఖాఖ బహుళ దశమినాడు హానుమాన్ చిన్నహనుమాన్, పెద్ద హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహిస్తారు. ఆంజన్న దీక్ష తీసుకుని లక్షలాది మంది స్వామివారిని దర్శించుకుంటారు. హనుమజయంతి సందర్భంగా మూడురోజుల పాటు హోమాలు నిర్వహిస్తారు. చైత్రశుద్ధనవమి రోజున సీతారాముల కల్యాణం వైభవంగా జరుగుతుంది. ఉదయం 4గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమై రాత్రి 8గంటలకు ఆలయాన్ని మూసి వేస్తారు. సంతాన లేమితో బాదపడేవారు 40రోజుల పాటు స్వామి వారికి పూజలు చేస్తే సంతనా భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం.

ఈ కొండగట్టు ఆంజన్న దేవాలయంలో ఆంజనేయస్వామి రెండు ముఖాలతో దర్శనమివ్వటం ప్రత్యేకత. నృసింహస్వామి, ఆంజనేయస్వామి ముఖాలతోపాటు, శంఖు చక్రాలు, హృదయంలో సీతారాములను కలిగి ఉండటం విశేషంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని 160 సంవత్సరాల క్రితం కృష్నారావు దేశ్ ముఖ్ నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ప్రతి మంగళవారం, శనివారాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి దర్శనానికి తరలివస్తుంటారు.