TTD : శ్రీవారి సర్వదర్శనానికి వెళుతున్నారా, ఆ సర్టిఫికేట్లు తప్పనిసరి!

ఆన్ లైన్ లో సర్వ దర్శనం టోకెన్లను విడుదల చేసింది టీటీడీ. కానీ...తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతుండడంతో పలు నిర్ణయాలు తీసుకుంది.

TTD : శ్రీవారి సర్వదర్శనానికి వెళుతున్నారా, ఆ సర్టిఫికేట్లు తప్పనిసరి!

Ttd

Sri Venkateswara Swamy : ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల ఆలయానికి ఎంతో మంది భక్తులు వస్తుంటారు. కానీ..కరోనా వైరస్ కారణంగా..భక్తుల దర్శనం విషయంలో పలు నిబంధనలు, ఆంక్షలను విధించింది టీటీడీ. గత కొన్ని రోజులుగా సర్వదర్శనం ఆపేసిన టీటీడీ..ఇటీవలే దీనిని పునరుద్ధరించింది. ఆన్ లైన్ లో సర్వ దర్శనం టోకెన్లను విడుదల చేసింది టీటీడీ. కానీ…తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతుండడంతో పలు నిర్ణయాలు తీసుకుంది. సెప్టెంబర్ 25వ తేదీల్లో ఆన్ లైన్ లో సర్వదర్శనం టోకెన్లను విడుదల చేస్తామని టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి వెల్లడించారు.

Read More : Tirupati Prostitution Case : తిరుపతిలో హైటెక్ వ్యభిచారం… వాట్సప్‌లోనే అన్నీ.. బాస్‌లు మహిళలే….!

అయితే..దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయినట్లు సర్టిఫికేట్, కరోనా నెగటివ్ సర్టిఫికేట్ తీసుకరావాలని సూచించారు. భక్తులు సర్వదర్శనం టోకెన్ల కోసం గుమికూడుతుండటం వల్ల కరోనా వేగంగా సంక్రమించే ప్రమాదం ఉందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ కానీ, దర్శనం సమయానికి మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకుని తెచ్చుకున్న నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుందని ఛైర్మన్ తెలిపారు. కోవిడ్ నియంత్రణ కోసం టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Read More : TTD Board : టీటీడీ బోర్డు నియామకంపై ఏపీ హై కోర్ట్ సీరియస్-ప్రభుత్వ జీవో సస్పెండ్

సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేస్తామని ఓ ప్రకటనలో వెల్లడించారాయన. సెప్టెంబరు 26వ తేదీ నుంచి అక్టోబరు 31వ తేదీ దాకా రోజుకు 8 వేల సర్వ దర్శనం టోకెన్లు ఆన్ లైన్ లో విడుదల చేస్తామన్నారు. సెప్టెంబరు 26వ తేదీ నుంచి తిరుపతిలో ఆఫ్ లైన్ లో సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపి వేస్తామని ప్రకటించారు. అక్టోబరు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ 300 టికెట్లు సెప్టెంబరు 24వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తామని ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు.