IPL 2022: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు షాక్ ఇచ్చిన బీసీసీఐ

: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) మొహాలీలో జరుగుతున్న టెస్టు ఫార్మాట్ ప్లేయర్లు మినహా నేషనల్ ప్లేయర్లందరినీ నేషనల్ క్రికెట్ అకాడమీలో జాయిన్ అవ్వాలని..

IPL 2022: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు షాక్ ఇచ్చిన బీసీసీఐ

Ipl Bcci Subhan 10tv

IPL 2022: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) మొహాలీలో జరుగుతున్న టెస్టు ఫార్మాట్ ప్లేయర్లు మినహా నేషనల్ ప్లేయర్లందరినీ నేషనల్ క్రికెట్ అకాడమీలో జాయిన్ అవ్వాలని సూచించింది. బీసీసీఐ బెంగళూరు ఫెసిలిటీ సెంటర్ లో 10 రోజుల ఫిట్‌నెస్ ప్రోగ్రాంకు హాజరుకానున్నారు. నేషనల్ సెలక్షన్ కమిటీ సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

మార్చి 4లోగా అకాడమీలో రిపోర్ట్ చేయాలని మార్చి 5నుంచి క్యాంప్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని వెల్లడించింది.

కేఎల్ రాహుల్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్ లాంటి ప్లేయర్లంతా రావాలని నేషనల్ క్రికెట్ అకాడమీ సూచించింది. రంజీ ట్రోఫీ ఆడుతున్న వారు మాత్రం మూడో రౌండ్, నాలుగో రౌండ్ లీగ్ గేమ్స్ పూర్తయ్యాక బెంగళూరుకు రావాల్సి ఉంది.

Read Also: మార్చి 15నుంచి ఐపీఎల్ టీమ్స్ ప్రాక్టీస్.. గ్రౌండ్‌లు ఇవే!

సూర్య కుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ చాహర్ లు గాయాలతో సతమతమవుతుండగా ఇప్పటికే ఫిట్ నెస్ కోసం నేషనల్ క్రికెట్ అకాడమీకి చేరుకున్నారు. వీవీఎస్ లక్ష్మణ్, ఎన్సీఏ అధికారుల పర్యవేక్షణలో వారి ఫిట్‌నెస్‌కు సానబెడుతున్నారు.