Paralympics : భవీనా పటేల్ జీవితం ఆదర్శం.. వీల్ చైర్ పై టేబుల్ టెన్నిస్ ఆడుతూ..!

గుజరాత్ వాద్ నగర్ కు చెందిన భవీనా 12 నెలల వయస్సులో పోలియో బారిన పడింది. అప్పుడు ఆమె నాలుగో తరగతి చదువుతోంది.

Paralympics : భవీనా పటేల్ జీవితం ఆదర్శం.. వీల్ చైర్ పై టేబుల్ టెన్నిస్ ఆడుతూ..!

Bhavina

Bhavina Patel’s Life : టోక్యో పారాలింపిక్స్ లో టేబుల్ టెన్నిస్ లో మహిళ క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్ రజత పతకం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. మహిళల టేబుల్ టెన్నిస్ విభాగంలో…భారత్ కు పతకం రావడం ఇదే తొలిసారి. 2021, ఆగస్టు 29వ తేదీ ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ప్రపంచ నెంబర్ వన్ చైనా క్రీడాకారిణి..జై యింగ్ తో భవీనా తలపడ్డారు. అయితే..3-0 తేడాతో పరాజయం చెందారు. అయినా..దేశానికి రజత పతకం సాధించిపెట్టారు. కానీ..ఆమె జీవితం అందరికీ ఒక ఆదర్శమని చెప్పవచ్చు. 12 నెలల వయస్సులో పోలియో బారిన పడిన ఈమె…ఆత్మవిశ్వాసంతో ముందడగు వేశారు. వీల్ ఛైర్ లో ఆడుతూ…ఎన్నో విజయాలు సాధించారు.

Read More : Tokyo Olympics Over : ముగిసిన టోక్యో ఒలింపిక్ క్రీడలు…ఏఏ దేశాలు ఎన్ని పతకాలు సాధించాయంటే

గుజరాత్ వాద్ నగర్ కు చెందిన భవీనా 12 నెలల వయస్సులో పోలియో బారిన పడింది. అప్పుడు ఆమె నాలుగో తరగతి చదువుతోంది. చికిత్స కోసం విశాఖకు తీసుకొచ్చారు. అయితే..డాక్టర్లు సూచించిన వ్యాయామాలు చేయకపోవడంతో…భవీనా ఆరోగ్యం బాగా కాలేదు. ఆమె కాళ్లు అచేతనంగా మారిపోయాయి. ఈ క్రమంలో…అహ్మదాబాద్ లోని బ్లైండ్ పీపుల్స్ అసోసియేషన్ లో సభ్యత్వం ఇప్పించారు.

Read More : Tokyo Olympics: విశ్వ క్రీడలు కరోనాకు కారణం అవుతున్నాయా?

అక్కడ క్రీడాకలాపాలు ఉండడంతో టేబుల్ టెన్నిస్ ను ఎంచుకున్నారు. కోచ్ లలన్ దోషి      ఆధ్వర్యంలో బ్యాట్ పట్టుకుని ఆడడం ప్రారంభించారు. అటు చదువుకుంటూనే…ఆటలో రాణించారు. గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి దూర విద్యలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తొలుత టేబుల్ టెన్నిస్ విభాగంలో జాతీయస్థాయిలో విజేతగా నిలిచారు. మెల్లిమెల్లిగా అంతర్జాతీయ టోర్నీలలో ఆడుతూ పతకాలు సాధించడం మొదలు పెట్టారు.

Read More : Bigg Boss 5: మారిన టెలికాస్ట్ టైమ్.. కొత్త టైమ్ ఏంటంటే?

2011లో థాయ్ లాండ్ ఓపెన్ పారా టీటీ టోర్నీలో భవీనా రజత పతకం సాధించారు. 2013లో ఆసియా చాంపియన్ షిప్ లో రజత పతకం కైవసం చేసుకున్నారు. అంతర్జాతీయ టోర్నీలో రాణిస్తూ..పలు విజయాలను సొంతం చేసుకున్నారు. 2017లో గుజరాత్ కు చెందిన రాష్ట్రస్థాయి మాజీ క్రికెటర్ నికుంజ్ పటేల్ ను వివాహం చేసుకున్నారు. పారాలింపిక్స్ లో టేబుల్ టెన్నిస్ విభాగంలో రజత పతకం సాధించడంతో భవీనాపై ప్రశంసల జల్లు కురుస్తోంది.