Big Bash League: టీ20 క్రికెట్లో సంచలనం… 15 పరుగులకే ఆలౌటైన జట్టు

టీ20 క్రికెట్లో శుక్రవారం సంచలనం నమోదైంది. ఒక జట్టు అత్యల్ప స్కోరుకే ఆలౌటై చరిత్ర సృష్టించింది. 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒక జట్టు 15 పరుగులకే ఆలౌటైంది.

Big Bash League: టీ20 క్రికెట్లో సంచలనం… 15 పరుగులకే ఆలౌటైన జట్టు

Big Bash League: టీ20 క్రికెట్ చరిత్రలో శుక్రవారం సంచలనం నమోదైంది. 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒక జట్టు 15 పరుగులకే ఆలౌటైంది. ఒక టీ20 జట్టు ఇంత తక్కువ పరుగులకు ఆలౌటవ్వడం ఇదే మొదటిసారి. ఈ సంచలనం ఆస్ట్రేలియాకు చెందిన ‘బిగ్ బాష్ లీగ్ 2022-2023’లో నమోదైంది. మన ఐపీఎల్ లాంటిదే అక్కడ ‘బిగ్ బాష్ లీగ్’.

Russia: యుక్రెయిన్‌పై మళ్లీ మిస్సైళ్లతో విరుచుకుపడుతున్న రష్యా.. మూడు నగరాలపై దాడులు

ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం స్థానిక జట్లైన సిడ్నీ థండర్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఇందులో ముందుగా బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. తర్వాత సిడ్నీ స్ట్రైకర్స్ జట్టు 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. అయితే, అత్యల్ప స్కోరుకే ఆలౌటైంది. మొత్తం 15 పరుగులే చేసి 10 వికెట్లు కోల్పోయింది. అది కూడా 5.5 ఓవర్లలోనే తన ఇన్నింగ్స్ పూర్తి చేసుకుంది. ఇది టీ20కి సంబంధించి సరికొత్త చరిత్ర. అడిలైడ్ స్ట్రైకర్స్ బౌలర్లు అద్భుతంగా బౌల్ చేశారు. వీరిలో థార్న్‌టాన్ 2.5 ఓవర్లలో 3 పరుగులు ఇచ్చి, 5 వికెట్లు తీశాడు.

మరో బౌలర్ అగర్.. 2 ఓవర్లలో 6 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఇంతకుముందు టీ20ల్లో తక్కువ స్కోరు రికార్డు టర్కీ పేరు మీద ఉండేది. ఆ జట్టు 2019లో చెక్ రిపబ్లిక్ చేతిలో తక్కువ స్కోరుకే ఔటైంది. 8.3 ఓవర్లలో 21 పరుగులకే ఆలౌటైంది. ఇప్పుడీ రికార్డు సిడ్నీ స్ట్రైకర్స్ పేరు మీద నమోదైంది.