Hardik Pandya: బంతిని కాదు.. బ్యాట్‌ను గాల్లోకి విసిరిన హార్దిక్ పాండ్యా

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆర్సీబీతో మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ గేమ్ లో పదో ఓవర్ ను ఆర్సీబీ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ వేస్తుండగా ఓ విచిత్రమైన ఘటన నమోదైంది.

Hardik Pandya: బంతిని కాదు.. బ్యాట్‌ను గాల్లోకి విసిరిన హార్దిక్ పాండ్యా

Hardik Pandya

 

 

Hardik Pandya: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆర్సీబీతో మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ గేమ్ లో పదో ఓవర్ ను ఆర్సీబీ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ వేస్తుండగా ఓ విచిత్రమైన ఘటన నమోదైంది.

హార్దిక్ పాండ్యా బ్యాట్ గాల్లోకి ఎగిరి స్క్వేర్ లెగ్ అంపైర్ దగ్గర పడింది. ఈ ఫీట్ కు ఫీల్డ్ లో ఉన్న వాళ్లంతా షాక్ అయిపోయారు. అక్కడకు వచ్చిన హార్దిక్ భార్య నటాసా నోరు తెరిచి అలా చూస్తుండిపోయింది. అసలేమైంది అనుకుంటూ అనుమానంతో కనిపించింది.

తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. గుజరాత్‌ టైటాన్స్ తో పోరులో అద్భుతంగా రాణించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్‌ నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ అలవోకగా ఛేదించింది. 18.4 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది.

బెంగళూరు ఓపెనర్లు కోహ్లీ (73), డుప్లెసిస్‌ (44) అదిరే శుభారంభాన్ని అందించారు. తర్వాత మ్యాక్స్‌వెల్ (40*) ధాటిగా ఆడడంతో బెంగళూరు గెలుపొందింది. ఈ విజయంతో బెంగళూరు ప్లేఆప్స్‌ ఆశలు సజీవంగానే ఉన్నాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్ 168/5 స్కోరు సాధించింది. దీంతో బెంగళూరు 18.4 ఓవర్లలో 170 పరుగులు చేసి విజయం సాధించింది.