IND vs AUS 3rd ODI: ఫైనల్ పోరులో విజేత ఎవరో? ఆ నలుగురు రాణిస్తే టీమిండియాదే సిరీస్ ..

టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్‌ను తన ఖాతాలో వేసుకొనేందుకు సన్నద్ధమైంది. విశాఖలో జరిగిన రెండో వన్డేలో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యంతో ఓటమిపాలైన విషయం విధితమే. ఏ ఒక్కరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. అయితే మూడో వన్డేలో పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశాలు ఉండటం భారత్ జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ పరిస్థితుల్లో ఆ నలుగురు ఆటగాళ్లు రాణిస్తే టీమిండియా విజయం నల్లేరుపై నడకే అవుతుందని మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు.

IND vs AUS 3rd ODI: ఫైనల్ పోరులో విజేత ఎవరో? ఆ నలుగురు రాణిస్తే టీమిండియాదే సిరీస్ ..

IND vs AUS 3rd ODI

IND vs AUS 3rd ODI: ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ జరుగుతుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తికాగా చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమఉజ్జీలుగా నిలిచారు. బుధవారం ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. చెన్నై వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. రెండో మ్యాచ్ లో అద్భుతమైన ఫాం కనబర్చిన ఆసీస్.. అదే ఆటతీరును పునరావృతం చేయాలని భావిస్తోంది. అయితే, పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మ్యాచ్ ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

IND vs AUS 2nd ODI Live Updates in Telugu: విశాఖ వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం.. పది వికెట్ల తేడాతో గెలిచిన ఆసీస్.. సిరీస్ సమం

టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్‌ను తన ఖాతాలో వేసుకొనేందుకు సన్నద్ధమైంది. విశాఖలో జరిగిన రెండో వన్డేలో బ్యాటింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఏ ఒక్కరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయకపోవటవంతో కేవలం 117 పరుగులకే ఆలౌట్ కావాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ రాణిస్తే భారత్ విజయం నల్లేరుపై నడకే అవుతుందని మాజీలు పేర్కొంటున్నారు. వీరిలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ తీరు ఆందోళనకు గురిచేస్తుంది. వరుసగా రెండు వన్డేల్లో డౌక్ కావటంతో అతనికి ఫైనల్ మ్యాచ్ లో అవకాశం ఉంటుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ విషయంపై కెప్టెన్ రోహిత్ స్పందిస్తూ.. సూర్యకుమార్ కు మరిన్ని అవకాశాలు ఇస్తామని చెప్పాడు.

IND vs AUS 2nd ODI: అతిపెద్ద ఓటమిని చవిచూసిన భారత్

చెన్నై పిచ్ స్పిన్ కు అనుకూలించనున్న నేపథ్యంలో.. బౌలింగ్ విభాగంలో పెద్దగా మార్పులు జరగకపోవచ్చని తెలుస్తోంది. రెండో వన్డేలో ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగింది. అదే జట్టు మూడో వన్డేకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మార్పులు చేయాల్సి వస్తే బౌలింగ్ విభాగంలో కుల్దీప్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను తుదిజట్టులోకి తీసుకొనే చాన్స్‌కూడా ఉంది. ఇక ఆసీస్ విషయానికి వస్తే.. ఎట్టిపరిస్థితుల్లోనూ వన్డే సిరీస్ ను కైవసంచేసుకోవాలని ఆ జట్టు ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. ఈ రోజు మ్యాచ్ లో వార్నర్ తుదిజట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాక, పిచ్ స్పిన్ కు అనుకూలించేఅ వకాశం ఉండటంతో మూడో స్పిన్నర్ గా అగర్ ను ఆడించే అవకాశముంది.

టీమిండియా తుది జట్టు (అంచనా)

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, KL రాహుల్ (WK), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్/వాషింగ్టన్ సుందర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా తుది జట్టు (అంచనా)

వార్నర్, హెడ్, స్మిత్, మార్ష్, కేరీ, గ్రీన్, మ్యాక్స్ వెల్, స్టాయినిస్, అబాట్/అగర్, స్టార్స్, జంపా.