Ind Vs Nz Kanpur Test.. కాన్పూర్ టెస్టు డ్రా.. భారత విజయాన్ని అడ్డుకున్న ఆ ఇద్దరు

భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రా గా ముగిసింది. కాన్పూర్ వేదికగా జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయానికి వికెట్ దూరంలో నిలిచిపోయింది.

Ind Vs Nz Kanpur Test.. కాన్పూర్ టెస్టు డ్రా.. భారత విజయాన్ని అడ్డుకున్న ఆ ఇద్దరు

Ind Vs Nz Kanpur Test Match

Ind Vs Nz Kanpur Test : భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రా గా ముగిసింది. కాన్పూర్ వేదికగా జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయానికి వికెట్ దూరంలో నిలిచిపోయింది. ఆఖరి రోజు మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. ఆఖరి సెషన్ లో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. 9 వికెట్లు తీశారు. కానీ ఆలౌట్ చేయలేకపోయారు. టీమిండియా ఒక్క వికెట్ తీస్తే విజయం సాధిస్తుందన్న తరుణంలో వెలుతురు లేమి ప్రతిబంధకంగా మారింది. ఓటమి అంచుల్లో నిలిచిన న్యూజిలాండ్ కు అదే వరంలా మారింది. మ్యాచ్ జరిగే వీల్లేకపోవడంతో అంపైర్లు ఆట నిలిపివేశారు.

సెకండ్ ఇన్నింగ్స్ లో మ్యాచ్ ముగిసే సమయానికి కివీస్ జట్టు 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జడేజా 4, అశ్విన్ 3 వికెట్లు తీశారు. ఉమేష్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. భారత్ రెండు ఇన్నింగ్స్ ల్లో 354, 234 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులు చేసింది. డిసెంబర్ 3న రెండో టెస్టు ప్రారంభం కానుంది.

చివరి రోజు ఆఖరి సెషన్‌లో గొప్పగా పుంజుకున్న భారత బౌలర్లు.. ఐదు వికెట్లు పడగొట్టారు. మరో వికెట్ తీసుంటే భారత్‌ ఘన విజయం సాధించేదే. అయితే, కివీస్‌ టెయిలెండర్లు అజాజ్‌ పటేల్ (23 బంతుల్లో 2 పరుగులు), రచిన్‌ రవీంద్ర (91 బంతుల్లో 18 పరుగులు) జాగ్రత్తగా ఆడుతూ వికెట్‌ను కాపాడుకున్నారు. ముఖ్యంగా రచిన్ రవీంద్ర భారత్ విజయానికి అడ్డుపడ్డాడు. 91 బంతులు ఆడిన రవీంద్ర 18 పరుగులే చేసినా, మరో వికెట్ పడకుండా ఆడి తమ జట్టును ఓటమి నుంచి కాపాడాడు. వీరిద్దరి కారణంగా భారత్‌ తొలి టెస్టుని డ్రాగా ముగించాల్సి వచ్చింది. విజయానికి అతి దగ్గరగా వచ్చిన టీమిండియాకు, అభిమానులకు చివరికి నిరాశే ఎదురైంది.

Eyes Carry Bags : కళ్ల కింద క్యారీ బ్యాగులా?…ఏం చేయాలంటే…

సెకండ్ ఇన్నింగ్స్‌లో కివీస్‌ ఓపెనర్ టామ్‌ లేథమ్‌ (146 బంతుల్లో 52 పరుగులు..3 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. సోమర్‌ విల్లే (110 బంతుల్లో 36 పరుగులు), కేన్‌ విలియమ్సన్‌ (112 బంతుల్లో 24 పరుగులు) ఆచితూచి ఆడుతూ మ్యాచ్‌ను డ్రా దిశగా తీసుకెళ్లారు.

ఆఖర్లో భారత ఫీల్డర్లందరూ బ్యాట్స్ మన్ చుట్టూ మోహరించి ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించినా, వెలుతురు లేమి టీమిండియాపైనే ఒత్తిడి కలిగించింది. దాంతో చివరి ఓవర్లలో అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా హడావుడిగా బంతులేయాల్సి వచ్చింది. మరోవైపు అంపైర్లు చీటికిమాటికి మీటర్లతో లైటింగ్ చెక్ చేస్తూ ఉన్న కొద్ది సమయాన్ని కరిగించారు.

Ghee : గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గటానికి నెయ్యి వాడకం మంచిది కాదా?

తొలి టెస్ట్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 345 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్ 296 పరుగులు చేసింది. కీలక ఆధిక్యం పొందిన భారత్ రెండో ఇన్నింగ్స్ ను 234/7 దగ్గర డిక్లేర్ చేసింది. దాంతో కివీస్ విజయలక్ష్యం 284 పరుగులు కాగా, ఆ జట్టు డ్రా కోసమే అన్నట్టుగా రక్షణాత్మక ధోరణిలో ఆడింది. చివరికి ఒక్క వికెట్ తేడాతో డ్రా చేసుకుని ఊపిరి పీల్చుకుంది. రెండో టెస్టు మ్యాచ్ డిసెంబర్ 3 నుంచి 7 వరకు ముంబై వాంఖడే స్టేడియంలో జరగనుంది.