Ind Vs SL : మూడో వన్డేలోనూ శ్రీలంకపై భారత్ సూపర్ విక్టరీ, వన్డే సిరీస్ క్లీన్ స్వీప్

శ్రీలంకతో వన్డే సిరీస్ లో భారత్ అదరగొట్టింది. సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. మూడో వన్డేలోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. తిరువనంతపురం వేదికగా లంకతో జరిగిన చివరి వన్డేలో భారత్ 317 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 391 పరుగుల భారీ లక్ష్యఛేదనలో శ్రీలంక 73 పరుగులకే కుప్పకూలింది.

Ind Vs SL : మూడో వన్డేలోనూ శ్రీలంకపై భారత్ సూపర్ విక్టరీ, వన్డే సిరీస్ క్లీన్ స్వీప్

Ind Vs SL : శ్రీలంకతో వన్డే సిరీస్ లో భారత్ అదరగొట్టింది. వరుస విజయాలతో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. మూడో వన్డేలోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. తిరువనంతపురం వేదికగా లంకతో జరిగిన చివరి వన్డేలో భారత్ 317 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 391 పరుగుల భారీ లక్ష్యఛేదనలో శ్రీలంక 73 పరుగులకే కుప్పకూలింది.

భారత బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లతో శ్రీలంకను బెంబేలెత్తించాడు. షమీ, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు తీశారు. ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడిన అషేన్ బండార బ్యాటింగ్ కు దిగలేదు. దీంతో అతడిని అబ్సెంట్ హర్ట్ గా పరిగణించారు.

Also Read..Indian Cricketer Ashwin: కెప్టెన్ రోహిత్‌శర్మ నిర్ణయాన్ని తప్పుబట్టిన అశ్విన్.. అలాచేయడం సరికాదంటూ ..

లంక జట్టు కేవలం 22 ఓవర్లు మాత్రమే ఆడింది. లంక బ్యాటర్లలో ఓపెనర్ నువనిదు ఫెర్నాండో 19, కసున్ రజిత 13 (నాటౌట్), కెప్టెన్ దసున్ షనక 11 పరుగులు చేశారు. చివరి మ్యాచ్ లోనూ గెలుపుతో వన్డే సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది రోహిత్ సేన.

కాగా, వన్డే చరిత్రలో ఇదే అతి పెద్ద విజయం. ఇప్పటివరకు ఈ రికార్డ్ న్యూజిలాండ్ పేరిట ఉంది. 2008లో ఐర్లాండ్ జట్టును న్యూజిలాండ్ 290 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పుడా రికార్డును టీమిండియా తిరగరాసింది.

Also Read..MS Dhoni: గత వరల్డ్ కప్ తర్వాతే రిటైర్ కావాలకున్న ధోనీ.. వెల్లడించిన మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్

మూడో వన్డేలో భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో, ఓపెనర్ శుభ్ మాన్ గిల్ శతకంతో చెలరేగారు. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 390 పరుగుల భారీ స్కోర్ చేసింది.

కోహ్లీ తన క్లాస్, మాస్ ఆటను చూపిస్తూ లంక బౌలింగ్ ను ఊచకోత కోశాడు. 110 బంతుల్లో 166 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కోహ్లీ స్కోర్ లో 13 ఫోర్లు, 8 భారీ సిక్సులు ఉన్నాయి. తొలుత శుభ్ మాన్ గిల్ (116) సెంచరీ కొట్టగా, ఆ తర్వాత కోహ్లీ దెబ్బకు లంక బౌలర్లు మరింత బెంబేలెత్తిపోయారు.

వన్డే కెరీర్ లో కోహ్లీకిది 46వ సెంచరీ. ఈ సిరీస్ లో 2 సెంచరీలతో సత్తా చాటాడు కోహ్లీ. తొలి వన్డేలోనూ కోహ్లీ సెంచరీ చేయడం తెలిసిందే. ఇక, కోహ్లీ మరో 3 సెంచరీలు చేస్తే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ (49 సెంచరీలు) రికార్డును సమం చేయనున్నాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.