IndVsSA 3rd T20I : చివరి టీ20లో టీమిండియా ఓటమి.. భారీ లక్ష్యఛేదనలో భారత్ విఫలం

సౌతాఫ్రికాతో జరిగిన చివరి మూడో టీ20 మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. ఇండోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 49 పరుగుల తేడాతో గెలుపొందింది.

IndVsSA 3rd T20I : చివరి టీ20లో టీమిండియా ఓటమి.. భారీ లక్ష్యఛేదనలో భారత్ విఫలం

IndVsSA 3rd T20I : సౌతాఫ్రికాతో జరిగిన చివరి మూడో టీ20 మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. ఇండోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 49 పరుగుల తేడాతో గెలుపొందింది. 228 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా… 18.3 ఓవర్లలో 178 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. దినేశ్ కార్తీక్ (46) మినహా మిగతా బ్యాటర్లు రాణించలేదు.

చివర్లో దీపక్ చాహర్ (31) ధాటిగా ఆడాడు. ఉమేష్ యాదవ్ 20 పరుగులు, హర్షల్ పటేల్ 17 పరుగులు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ (8) నిరాశపరిచాడు. రిషబ్ పంత్ 14 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 27 పరుగులు చేశాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

హర్షల్ పటేల్ 17 పరుగులు చేయగా, ఆఖర్లో దీపక్ చహర్, ఉమేశ్ యాదవ్ బ్యాట్లు ఝుళిపించడంతో టీమిండియా 150 పరుగుల మార్కు దాటింది. చహర్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 31 పరుగులు చేశాడు. ఉమేశ్ యాదవ్ 20 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు.

సౌతాఫ్రికా బౌలర్లలో ప్రిటోరియస్ మూడు వికెట్లు తీశాడు. పార్నెల్, ఎంగిడి, మహరాజ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. రబాడ ఒక వికెట్ తీశాడు. మూడు మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో గెలుపొందింది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి సిరీస్ ను కోల్పోయిన సఫారీ జట్టు చివరి టీ20లో ఊరట పొందింది.

ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఈ నెల 6 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లక్నోలో జరగనుంది. రెండో వన్డే ఈ నెల 9న రాంచీలో, మూడో వన్డే ఈ నెల 11న ఢిల్లీలో జరగనున్నాయి.