IPL 2022: ఐపీఎల్ షెడ్యూల్‌తో సహా పూర్తి వివరాలు వెల్లడించిన బీసీసీఐ

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) మరి కొద్ది వారాల్లో మొదలుకానున్న టాటా ఐపీఎల్ 2022కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించింది. ముంబై, పూణె వేదికల్లో నిర్వహించనున్న

IPL 2022: ఐపీఎల్ షెడ్యూల్‌తో సహా పూర్తి వివరాలు వెల్లడించిన బీసీసీఐ

Ipl

IPL 2022: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) మరి కొద్ది వారాల్లో మొదలుకానున్న టాటా ఐపీఎల్ 2022కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించింది. ముంబై, పూణె వేదికల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. 70లీగ్ మ్యాచ్‌లు, 4ప్లే ఆఫ్ గేమ్స్‌ను 65రోజుల్లోగా పూర్తి చేయాలనేది బీసీసీఐ ప్లాన్.

మార్చి 26నుంచి ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభించాలని ప్లాన్ చేసిన బీసీసీఐ.. తొలి మ్యాచ్ ను ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‍కతా నైట్ రైడర్స్‌ల మధ్య నిర్వహించేందుకు ప్లాన్ చేశారు.

మార్చి 27న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ తో పాటుగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ జరగనున్నాయి. బ్రబౌర్న్, పాటిల్ స్టేడియాల వేదికగా ఆరంభం కానున్నాయి. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్ ను మార్చి 29న రాజస్థాన్ రాయల్స్ తో పూణె వేదికగా ఆడుతుంది.

Read Also: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు షాక్ ఇచ్చిన బీసీసీఐ

వాంఖడే స్టేడియంలో, పాటిల్ స్టేడియంలో ఒక్కోదానిలో 20 మ్యాచ్‌లు, బ్రబౌర్న్, ఎంసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలలో 15చొప్పున మ్యాచ్ లు నిర్వహించాలని ప్లాన్ చేశారు.

రెండు మ్యాచ్ లు ఉన్న సమయంలో తొలి మ్యాచ్ 3గంటల 30నిమిషాలకు ఆరంభం కానుండగా రెండో మ్యాచ్ 7గంటల 30నిమిషాలకు ఆరంభం అవుతుంది.

ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ లు ఎక్కడ నిర్వహించాలనే విషయాన్ని ఇంకా సందిగ్ధంలోనే ఉంచింది బీసీసీఐ. త్వరలోనే వివరాలు వెల్లడిస్తాయని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు.

Ipl Schedule 1

Ipl Schedule 1

Ipl Schedule 2

IPL Schedule 2