IPL 2022 Mumbai Indians : ముంబై ఇండియన్స్ బోణీ కొట్టేనా…?

ఐపీఎల్ లో రికార్డు స్థాయిలో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ తాజా సీజన్ లో ఇప్పటిదాకా ఒక్క విజయం సాధించలేకపోయిందంటే విమర్శకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

IPL 2022 Mumbai Indians : ముంబై ఇండియన్స్ బోణీ కొట్టేనా…?

Ipl 2022 Mumbai Indians

IPL 2022 Mumbai Indians : ఐపీఎల్ 2022 సీజన్ 15 లో భాగంగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. కాగా, ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పటివరకు ఈ సీజన్ లో ఒక్క గెలుపు కూడా సాధించలేదు. దీంతో, కనీసం ఇవాళ్టి మ్యాచ్ లో అయినా రోహిత్ శర్మ సేన గెలుపు బోణీ కొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఐపీఎల్ లో రికార్డు స్థాయిలో ఐదుసార్లు చాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ తాజా సీజన్ లో ఇప్పటిదాకా ఒక్క విజయం సాధించలేకపోయిందంటే విమర్శకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆడిన 7 మ్యాచుల్లోనూ ముంబయి ఇండియన్స్ కు ఓటమే ఎదురైంది. అసలు, లోపం ఎక్కడుందన్నది విశ్లేషించుకోవడంలోనూ ఆ జట్టు విఫలమవుతోందనడానికి వరుస ఓటములే నిదర్శనం.(IPL 2022 Mumbai Indians)

IPL2022 RCB Vs SRH : హైదరాబాద్ జైత్రయాత్ర.. వరుసగా 5వ విజయం

లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి సారథి రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా, ముంబై జట్టులో ఎలాంటి మార్పులు లేవు. అటు, లక్నో జట్టులో ఒక మార్పు జరిగింది. పేస్ బౌలర్ అవేశ్ ఖాన్ గాయంతో బాధపడుతుండగా, అతడి స్థానంలో మొహిసిన్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. ముంబయిలోని వాంఖడే మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది.

IPL2022 KKR Vs GT : ఉత్కంఠపోరులో కోల్‌కతాపై గుజరాత్‌దే విజయం.. టాప్‌లోకి హార్ధిక్ గ్యాంగ్

కరోనా వ్యాప్తి కారణంగా ఈసారి ఐపీఎల్ లీగ్ దశ మ్యాచ్ లు ముంబై, పుణెలోనే నిర్వహిస్తున్నారు. అది కూడా అత్యధిక మ్యాచులు ముంబయిలోని వాంఖడే, బ్రాబౌర్న్, డీవై పాటిల్ మైదానాల్లోనే నిర్వహిస్తున్నారు. సొంత గడ్డపై ఆడుతున్నప్పటికీ ముంబయి ఇండియన్స్ ఇప్పటిదాకా గెలుపు బోణీ కొట్టకపోవడం ఫ్యాన్స్ ను ఆవేదనకు గురి చేస్తోంది.

ఆడిన ఏడు మ్యాచుల్లో ఒక్క దాంట్లోనూ ముంబై ఇండియన్స్ గెలవలేదంటే.. లోపం ఎక్కడుంది? అనే ప్రశ్నకు ఇంగ్లండ్ మాజీ దిగ్గజ ఆటగాడు కెవిన్ పీటర్సన్ సమాధానమిచ్చాడు.

మెగా వేలంతోనే ఆ జట్టు వైఫల్యం మొదలైందని, ఈ సీజన్ వారికి ఓ ఉత్పాతమని పీటర్సన్ చెప్పాడు. ఆ వేలం వల్ల జట్టు ఆత్మ పూర్తిగా తునాతునకలైందని అన్నాడు. వేలంలో ముంబై వ్యూహంపై మండిపడ్డాడు. గాయంతో ఉన్న జోఫ్రా ఆర్చర్ కోసం మంచి ఫామ్ లో ఉన్న ట్రెంట్ బౌల్ట్ ను వదిలేసుకోవడం అతిపెద్ద తప్పని చెప్పాడు.

ప్రస్తుతం ముంబై బౌలింగ్ చాలా బలహీనంగా మారిపోయిందని, అంత బలహీన బౌలింగ్ దళం ఇంతకుముందెన్నడూ లేదని వాపోయాడు. పొట్టి గేమ్ లలో లెఫ్టార్మ్ సీమర్లు చాలా అవసరమని, అందులో బౌల్ట్ వరల్డ్ క్లాస్ అని విశ్లేషించాడు. వేలంలో మ్యాచ్ విన్నర్లయిన పాండ్యా సోదరులు, క్వింటన్ డికాక్ వంటి వారిపై దృష్టి పెట్టకపోవడం విచారకరమన్నారు. ఇప్పుడు జట్టులో ఏం జరుగుతోందో తెలియక మహేలా జయవర్ధనే షాక్ అవుతుండొచ్చు అని అన్నాడు. మొత్తానికి ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాళ్లను మాత్రం కోల్పోయిందని పీటర్సన్ చెప్పుకొచ్చాడు.