IPL 2023, DC vs GT: గుజరాత్ గర్జన.. ఢిల్లీపై విజయం

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్-గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి.

IPL 2023, DC vs GT: గుజరాత్ గర్జన.. ఢిల్లీపై విజయం

Ipl 2023 Match No 7

IPL 2023, DC vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 (IPL 2023)లో ఇవాళ ఏడో మ్యాచ్ జరిగింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్-గుజరాత్ టైటాన్స్ (DC vs GT) తలపడ్డాయి. ఢిల్లీ జట్టుపై గుజరాత్ గెలుపొందింది.

6 వికెట్ల తేడాతో ఢిల్లీ జట్టుపై గుజరాత్ టైటాన్స్ విక్టరీ కొట్టింది. ఢిల్లీ నిర్దేశించిన 163 పరుగుల టార్గెట్ ను.. 18.1ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి చేధించింది గుజరాత్ టైటాన్స్. గుజరాత్ జట్టులో సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 48 బంతుల్లో 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముందుండి మరీ జట్టుని గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. 20ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 04 Apr 2023 11:29 PM (IST)

    ఢిల్లీని చిత్తు చేసిన గుజరాత్

    ఐపీఎల్ 2023లో భాగంగా ఢిల్లీ కేపిటల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో గుజరాత్ గర్జించింది. ఢిల్లీపై విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో ఢిల్లీ జట్టుపై గుజరాత్ టైటాన్స్ విక్టరీ కొట్టింది. ఢిల్లీ నిర్దేశించిన 163 పరుగుల టార్గెట్ ను.. 18.1ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి చేధించింది గుజరాత్ టైటాన్స్.

    గుజరాత్ జట్టులో సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 48 బంతుల్లో 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముందుండి మరీ జట్టుని గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. 20ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

  • 04 Apr 2023 09:52 PM (IST)

    14 పరుగులు చేసి సాహా ఔట్

    గుజరాత్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసి సాహా ఔట్ అయ్యాడు. శుభ్ మన్ గిల్ (13), సాయి సుదర్శన్ (2) క్రీజులో ఉన్నారు. గుజరాత్ జట్టు స్కోరు 30/1 (3 ఓవర్లకు)గా ఉంది. 

  • 04 Apr 2023 09:22 PM (IST)

    ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 162

    గుజరాత్ టైటాన్స్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్ 163 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. డేవిడ్ వార్నర్ 37, అక్షర్ పటేల్ 36, సర్ఫరాజ్ ఖాన్ 30, అభిషేక్ 20 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేదు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. గుజరాత్ జట్టులో రషీద్ ఖాన్, షమీ మూడేసి వికెట్లు తీశారు. జోసెఫ్ 2 వికెట్లు పడగొట్టాడు.

  • 04 Apr 2023 09:06 PM (IST)

    6 వికెట్లు డౌన్

    ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్లు కోల్పోయింది. సర్ఫరాజ్ ఖాన్ 30 పరుగులు చేసి ఔటయ్యాడు. ఢిల్లీ స్కోరు 132/6 (17 ఓవర్లకు)గా ఉంది. 

  • 04 Apr 2023 08:47 PM (IST)

    5 వికెట్లు డౌన్

    ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్లు కోల్పోయింది. అభిషేక్ 20 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.

  • 04 Apr 2023 08:19 PM (IST)

    4 వికెట్లు డౌన్

    ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్లు కోల్పోయింది. డేవిడ్ వార్నర్ 37 పరుగులు చేసి జోసెఫ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఆ వెంటనే రిలీ రోసౌ డకౌట్ గా వెనుదిరిగాడు.

  • 04 Apr 2023 08:05 PM (IST)

    6 ఓవర్లకి 52/2

    ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 6 ఓవర్లకి 52/2గా ఉంది. డేవిడ్ వార్నర్ (25), సర్ఫరాజ్ ఖాన్ (2) క్రీజులో ఉన్నారు.

  • 04 Apr 2023 07:56 PM (IST)

    రెండో వికెట్ డౌన్

    మిచెల్ మార్ష్ 4 పరుగులకే షమీ బౌలింగ్ లో ఔటయ్యాడు. డేవిడ్ వార్నర్ (16), సర్ఫరాజ్ ఖాన్ క్రీజులో ఉన్నారు.

  • 04 Apr 2023 07:53 PM (IST)

    స్కోరు 4 ఓవర్లలో 33/1

    ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 4 ఓవర్లలో 33/1గా ఉంది. డేవిడ్ వార్నర్ (16), మిచెల్ మార్ష్ (0) క్రీజులో ఉన్నారు.

  • 04 Apr 2023 07:48 PM (IST)

    పృథ్వీ షా ఔట్

    ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. పృథ్వీ షా 7 పరుగులకే షమీ బౌలింగ్ లో ఔటయ్యాడు.

  • 04 Apr 2023 07:38 PM (IST)

    తొలి ఓవర్లో 11 పరుగులు

    ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ప్రారంభించింది. పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చారు. తొలి ఓవర్లో 11 పరుగులు చేశారు.

  • 04 Apr 2023 07:16 PM (IST)

    హార్దిక్ పాండ్యా సేన

    గుజరాత్ టైటాన్స్ జట్టు: వృద్ధిమాన్ సాహా, శుభ్ మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, జాషువా లిటిల్, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్

  • 04 Apr 2023 07:15 PM (IST)

    డేవిడ్ వార్నర్ సేన

    ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, రిలీ రోసౌ, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అన్ రిచ్

  • 04 Apr 2023 07:02 PM (IST)

    గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్

    టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది.