IPL 2023 Prize Money: ఐపీఎల్‌లో ఏ జట్టుకు ఎంత ఫ్రైజ్‌మనీ వచ్చింది.. ఏ ప్లేయర్‌కు ఏ అవార్డు వచ్చిందో తెలుసా?

ఫైనల్ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజేతగా నిలిచింది. మ్యాచ్ అనంతరం ఛాంపియన్, రన్నరప్ జట్లకు బీసీసీఐ నగదును అందించింది.

IPL 2023 Prize Money: ఐపీఎల్‌లో ఏ జట్టుకు ఎంత ఫ్రైజ్‌మనీ వచ్చింది.. ఏ ప్లేయర్‌కు ఏ అవార్డు వచ్చిందో తెలుసా?

IPL 2023 Prize Money

IPL 2023 Final: చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) అద‌ర‌గొట్టింది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో ఐదోసారి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ క్ర‌మంలో ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక టైటిళ్లు అందుకున్న‌ ముంబై ఇండియ‌న్స్ రికార్డును స‌మం చేసింది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌(Gujarat Titans)తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో డ‌క్ వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో చెన్నై ఐదు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. విజయం తరువాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ రూ. 20కోట్లు ఫ్రైజ్‌మనీ అందుకున్నారు.

IPL2023 Final: ఐపీఎల్‌-16 టైటిల్ విజేత‌గా చెన్నై.. ఉత్కంఠ పోరులో గుజ‌రాత్ పై విజ‌యం

ఏ జట్టుకు ఎంత ప్రైజ్‌మనీ వచ్చిందంటే..

ఐపీఎల్ 16వ సీజన్ ముగిసింది. ఆది నుంచి చివరి వరకు మ్యాచ్ లు ఉత్కంఠ భరితంగా సాగాయి. నువ్వానేనా అన్నట్లు జట్లు తలపడ్డాయి. చివరికి ఫైనల్ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజేతగా నిలిచింది. మ్యాచ్ అనంతరం ఛాంపియన్, రన్నరప్ జట్లకు బీసీసీఐ ఫ్రైజ్‌మనీ అందించింది. చెన్నై సూపర్ కింగ్స్ (ఛాంపియన్) రూ. 20 కోట్లు, గుజరాత్ టైటాన్స్ (రన్నరప్) రూ. 13 కోట్లు, ముంబై ఇండియన్స్ (3వ స్థానం) రూ. 7కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ (4వ స్థానం) రూ. 6.5 కోట్లు అందుకున్నాయి.

MS Dhoni: ఐపీఎల్‌లో చ‌రిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని.. రోహిత్‌, కోహ్లికి సాధ్యం కాలేదు

10లక్షల విలువైన అవార్డులు అందుకున్న ప్లేయర్లు ..

–  మహ్మద్ షమీ (పర్పుల్ క్యాప్) : సీజన్‌లో (28 వికెట్లు) అత్యధిక వికెట్లు.
–  శుభ్‌మన్ గిల్ (ఆరెంజ్ క్యాప్) : సీజన్‌లో (890 పరుగులు) అత్యధిక పరుగులు.
–  యశస్వీ జైస్వాల్ : ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్.
–  గ్లెన్ మాక్స్‌వెల్ : సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ (183.48 స్ట్రైక్ రేట్).
–  శుభ్‌మన్ గిల్ : గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్.
–  ఢిల్లీ క్యాపిటల్స్ : పేటీఎం ఫెయిర్ ప్లే అవార్డు
–  రషీద్ ఖాన్ : క్యాచ్ ఆఫ్ సీజన్
–  శుభ్‌మన్ గిల్ : అత్యంత విలువైన ఆటగాడు
–  శుభ్‌మన్ గిల్ : సీజన్‌లోని అత్యధిక ఫోర్లు (85)
–  ఫాఫ్ డు ప్లెసిస్ : సీజన్ లో పొడవైన సిక్స్ (115 మీటర్లు)
–  సీజన్ యొక్క ఉత్తమ వేదిక : ఈడెన్ గార్డెన్స్, వాంఖడే స్టేడియం (50లక్షలు)