IPL2022 Hyderabad Vs MI : వరుస ఓటములకు బ్రేక్.. ముంబైపై హైదరాబాద్ థ్రిల్లింగ్ విక్టరీ

ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములకు బ్రేక్ పడింది. వరుసగా ఐదు పరాజయాల తర్వాత హైదరాబాద్‌ గెలుపు సాధించింది.

IPL2022 Hyderabad Vs MI : వరుస ఓటములకు బ్రేక్.. ముంబైపై హైదరాబాద్ థ్రిల్లింగ్ విక్టరీ

Ipl2022 Hyderabad Vs Mi (1)

IPL2022 Hyderabad Vs MI : ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములకు బ్రేక్ పడింది. వరుసగా ఐదు పరాజయాల తర్వాత హైదరాబాద్‌ గెలుపు సాధించింది. ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య పోరు ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా నడిచింది. ఈ పోరులో ముంబైపై హైదరాబాద్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఇక ఎప్పటిలాగే గెలుపు ముంగిట్లో ముంబై చతికలపడింది. హైదరాబాద్ నిర్దేశించిన 194 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై.. 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 190 పరుగులే చేసింది. టార్గెట్ కి అతి సమీపంగా వచ్చి ఆగిపోయింది. దీంతో మూడు పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది.(IPL2022 Hyderabad Vs MI)

MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ అభిమాని రాసిన లెటర్‌కు ధోనీ సూపర్ రియాక్షన్

ముంబై బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(48), టిమ్ డేవిడ్(46), ఇషాన్ కిషన్(43) రాణించారు. టిమ్ డేవిడ్ క్రీజులో ఉన్నంతసేపు ముంబై గెలుపుపై ఆశలు చిగురించాయి. టిమ్ డేవిడ్ రనౌట్ కావడంతో ఓటమి తప్పలేదు. హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు. టి. నటరాజన్‌ (0/60) భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు.

రోహిత్ శర్మ, ఇషాన్‌ కిషన్‌ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. ఆ తర్వాత టిమ్‌ డేవిడ్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరు ధాటిగా ఆడటంతో ఓ దశలో ముంబై గెలిచేలా కనిపించింది. అయితే భువనేశ్వర్‌ కుమార్‌ (1/26), ఉమ్రాన్‌ మాలిక్ (3/23) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో హైదరాబాద్‌ విజయం సాధించింది. ఓ దశలో మ్యాచ్‌ స్వరూపాన్నే సమూలంగా మార్చేసిన టిమ్‌ డేవిడ్‌ అనవసర రన్‌కు యత్నించి ఔటయ్యాడు. దీంతో ముంబైకి ఓటమి తప్పలేదు.

ఈ సీజన్ లో 13 మ్యాచులు ఆడిన హైదరాబాద్ కు ఇది 6వ విజయం. 12 పాయింట్లతో.. పాయింట్ల టేబుల్ లో 8వ స్థానంలో ఉంది. మరోవైపు ముంబై 13 మ్యాచుల్లో కేవలం మూడు విజయాలే నమోదు చేసింది. 10 ఓటములు, 6 పాయింట్లతో పాయింట్ల టేబుల్ లో అట్టడుగు స్థానంలో ఉంది. ఇప్పటికే ముంబై ఫ్లేఆఫ్స్ రేస్ నుంచి ఔట్ అయ్యింది.

గెలిచి నిల‌వాల్సిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైద‌రాబాద్ స‌న్ రైజ‌ర్స్ బ్యాట‌ర్లు జూలు విదిల్చారు. రాహుల్ త్రిపాఠి (76) ఆకాశ‌మే హ‌ద్దు అన్న‌ట్టుగా చెలరేగాడు. 44 బంతుల‌ను ఎదుర్కొన్న త్రిపాఠి… 9 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో ఏకంగా 76 ప‌రుగులు చేశాడు.

IPL2022 PunjabKings Vs DC : దుమ్మురేపిన ఢిల్లీ.. ప్లేఆఫ్స్ ఆశలు సజీవం.. పంజాబ్ ఇంటికే

గార్గ్ అవుటైన త‌ర్వాత త్రిపాఠితో జ‌త క‌లిసిన నికోల‌స్ పూర‌న్(38) కూడా స‌త్తా చాటాడు. వీరిద్ద‌రూ 172.72 స్ట్రయిక్ రేటుతో చెల‌రేగారు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 193 ప‌రుగులు చేసింది హైదరాబాద్. ముంబై బౌలర్లలో ర‌మ‌ణ‌దీప్ సింగ్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటుగా 3 వికెట్ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. డానియల్‌ సామ్స్, రిలే మెరిడెత్, బుమ్రా తలో వికెట్ తీశారు. ఇక టీ20 ఫార్మాట్‌లో 250 వికెట్లు తీసిన బౌలర్‌గా బుమ్రా ఘనత వహించాడు.