IPL2022 Punjab Vs Bangalore : పంజాబ్ వీరోచిత పోరాటం.. బెంగళూరుపై సంచలన విజయం

ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. 206 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్..(IPL2022 Punjab Vs Bangalore :)

IPL2022 Punjab Vs Bangalore : పంజాబ్ వీరోచిత పోరాటం.. బెంగళూరుపై సంచలన విజయం

Ipl2022 Pbks Vs Rcb (1)

IPL2022 Punjab Vs Bangalore : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. మరో 6 బంతులు మిగిలి ఉండగానే, 5 వికెట్ల తేడాతో ఆర్సీబీని చిత్తు చేసింది. 206 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్.. 19 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించింది. పాపం బెంగళూరు.. డబుల్ సెంచరీ స్కోర్ చేసినా గెలుపు మాత్రం దక్కలేదు. పంజాబ్ జట్టు 19 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.

IPL 2022: ఇషాన్ ఓపెనర్‌గా దిగితే హాఫ్ సెంచరీ ఖాయం.. రికార్డులివే

పంజాబ్ బ్యాటర్లలో ఎవరూ పెద్దగా స్కోర్ చేయలేదు. కానీ అందరూ రాణించారు. ఇది పంజాబ్ కు కలిసొచ్చింది. శిఖర్ ధావన్(43), రాజపక్స(43) రాణించగా.. షారూక్ ఖాన్(20 బంతుల్లో 24 పరుగులు), ఒడియన్ స్మిత్(8 బంతుల్లో 24 పరుగులు) అదరగొట్టారు. జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశారు. ముఖ్యంగా స్మిత్ మూడు సిక్సులు బాదేశాడు. పంజాబ్ కెప్టెన్, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 24 బంతుల్లో 32 పరుగులతో రాణించాడు. బెంగళూరు బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశాడు. ఆకాష్ దీప్, హసరంగా, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు.(IPL2022 Punjab Vs Bangalore)

IPL 2022: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, యువరాజ్‌ సింగ్ లతో సమానంగా ఇషాన్ కిషన్

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు జట్టు భారీ స్కోరే (205) చేసింది. కెప్టెన్‌ డుప్లెసిస్‌(88) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తర్వాత 206 పరుగుల లక్ష్య చేధనలో పంజాబ్‌ వీరోచితంగా పోరాడింది. మయాంక్‌ అగర్వాల్‌(32), శిఖర్‌ ధావన్‌(43), రాజపక్స(43), ఓడియన్‌ స్మిత్‌(25*), షారుక్‌ఖాన్‌(24*) మెరుగైన ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

బెంగళూరు కొత్త కెప్టెన్ డుప్లెసిస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఓపెనర్ గా వచ్చిన డుప్లెసిస్ పంజాబ్ బౌలర్లను ఊచకోత కోశాడు. సిక్సులు, ఫోర్ల వర్షం కురిపించాడు. మొత్తం 57 బంతులాడిన డుప్లెసిస్ 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 88 పరుగులు చేశాడు. అర్షదీప్ బౌలింగ్ లో ఓ భారీ షాట్ కొట్టే యత్నంలో షారుఖ్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.(IPL2022 Punjab Vs Bangalore)

IPL2022 KKR Beats CSK : ఐపీఎల్‌లో కోల్‌కతా బోణీ.. చెన్నైపై గెలుపు

ఇక, మాజీ కెప్టెన్ కోహ్లీ వేగంగా ఆడి 29 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 41 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఖర్లో దినేశ్ కార్తీక్ (డీకే) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్కోరు 200 మార్కు దాటింది. దినేశ్ కార్తీక్ కేవలం 14 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 32 పరుగులు చేశాడు. బెంగళూరు భారీ స్కోరే చేసినా గెలుపు మాత్రం సాధించలేకపోయింది.

Watch IPL 2022 Live Matches : భారత్ సహా ప్రపంచంలో ఎక్కడైనా ఐపీఎల్ లైవ్ మ్యాచ్‌లను ఆన్‌లైన్‌లో ఇలా చూడొచ్చు..!

స్కోర్లు..
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్- 2 వికెట్ల నష్టానికి 205 పరుగులు
పంజాబ్ కింగ్స్ – 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు