IPL2022 RCB Vs SRH : దంచికొట్టిన డుప్లెసిస్.. హైదరాబాద్ ముందు బిగ్ టార్గెట్
హైదరాబాద్‌తో మ్యాచ్‌లో బెంగళూరు కెప్టెన్ డు ప్లెసిస్ (73*) దంచికొట్టాడు. డుప్లెసిస్ తో పాటు రజత్ పటిదార్ (48), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (33), దినేశ్ కార్తిక్ (30*) ధాటిగా ఆడారు. ఫలితంగా బెంగళూరు భారీ స్కోర్ చేసింది.

IPL2022 RCB Vs SRH : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. టాస్ నెగ్గిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. హైదరాబాద్ ముందు 193 పరుగులు భారీ లక్ష్యం నిర్దేశించింది.
హైదరాబాద్‌తో మ్యాచ్‌లో బెంగళూరు కెప్టెన్ డు ప్లెసిస్ (73*) దంచికొట్టాడు. డుప్లెసిస్ 50 బంతుల్లో 73 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 8 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. డుప్లెసిస్ తో పాటు రజత్ పటిదార్ (48), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (33), దినేశ్ కార్తిక్ (30*) ధాటిగా ఆడారు. ఫలితంగా బెంగళూరు భారీ స్కోర్ చేసింది. కాగా, విరాట్ కోహ్లీ మరోసారి తీవ్రంగా నిరాశపరించాడు. గోల్డెన్ డకౌట్ అయ్యాడు. హైదరాబాద్ బౌలర్లలో జగదీశ్ సుచిత్ రెండు వికెట్లు పడగొట్టాడు. కార్తిక్ త్యాగి ఒక వికెట్ తీశాడు.
Virat Kohli: ఐపీఎల్ 2022లో మూడోసారి గోల్డెన్ డక్‌గా విరాట్
చివరల్లో దినేశ్ కార్తిక్ మెరుపులు మెరిపించాడు. ఫరూఖి వేసిన చివరి ఓవర్‌లో ఏకంగా 25 పరుగులు రాబట్టాడు. ఇందులో మూడు సిక్సర్లు, ఒక ఫోర్ ఉన్నాయి. బౌండరీ లైన్ వద్ద త్రిపాఠి క్యాచ్ మిస్ చేయడంతో వరుస బంతుల్లో కార్తిక్ మూడు సిక్సర్లతో పాటు ఫోర్ బాదడం విశేషం. ఆఖరి ఐదు ఓవర్లలో బెంగళూరు బ్యాటర్లు 67 పరుగులను జోడించారు.

IPL2022 RCB Vs SRH Hyderabad Target 193
కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. జగదీష్ సుచిత్ వేసిన తొలి ఓవర్‌లో మొదటి బంతికే విరాట్ కోహ్లీ (0) గోల్డెన్ డకౌట్ అయ్యాడు. టీ20 లీగ్‌లో కోహ్లీ ఇప్పటివరకు ఆరుసార్లు గోల్డెన్ డకౌట్ కాగా.. ఇందులో మూడు ఈ సీజన్‌లోనే(2022) కావడం గమనార్హం. రెండుసార్లు హైదరాబాద్‌తోనే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.
Chris Gayle: “నాకు గౌరవం దక్కలేదు.. అలా జరగాల్సిందే”
ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడిన బెంగళూరు 6 విజయాలు నమోదు చేసింది. ప్రస్తుతం 12 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్న బెంగళూరు ఈ మ్యాచ్ లో గెలుపొంది ప్లేఆఫ్స్ రేసులో ముందుకు వెళ్లాలని చూస్తోంది. మరోవైపు హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు 10 మ్యాచులు ఆడింది. 5 మ్యాచుల్లో గెలుపొందింది. ప్రస్తుతం 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్న హైదరాబాద్.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ముందుకు దూసుకుపోవాలని భావిస్తోంది.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, మార్‌క్రమ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, సుచిత్, కార్తిక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, ఫారూకీ, ఉమ్రాన్ మాలిక్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: విరాట్ కోహ్లీ, ఫా డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రర్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, వానిందు హసరంగ, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్.
Leading from the front, @faf1307 is our Top Performer from the first innings for his knock of 73*.
A look at his batting summary here 👇👇 #TATAIPL #SRHvRCB pic.twitter.com/IY6o2dJKzV
— IndianPremierLeague (@IPL) May 8, 2022
- IPL2022 Chennai vs RR : అదరగొట్టిన అశ్విన్.. చెన్నైపై రాజస్తాన్ విజయం.. టాప్ 2లోకి సంజూ సేన
- Hardik Pandya: బంతిని కాదు.. బ్యాట్‌ను గాల్లోకి విసిరిన హార్దిక్ పాండ్యా
- Virat Kohli: సీజన్లో తొలి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ
- IPL2022 Gujarat Vs RCB : బెంగళూరు భళా.. కీలక మ్యాచ్‌లో గుజరాత్‌పై విజయం, ఫ్లేఆఫ్స్ ఆశలు సజీవం
- IPL2022 RCB Vs GujaratTitans : పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్.. బెంగళూరు టార్గెట్ ఎంతంటే
1Frontier airlines: విమానంలో ప్రసవించిన మహిళ.. శిశువుకు ఏం పేరు పెట్టారో మీరు ఊహించగలరా?
2VAT on Petrol,Diesel : పెట్రోల్,డీజిల్‌పై వ్యాట్ తగ్గించిన రాష్ట్రాలు
3Bollywood : బాలీవుడ్ స్టార్ హీరోలపై కేసు నమోదు
4Nirmala Sitharaman: అన్నదాతకు ఊరట.. కీలక ప్రకటన చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి
5VishwakSen : హిట్ పడగానే రేటు పెంచేసిన హీరో..
6MLC Ananthababu : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై హత్య కేసు నమోదు
7Vijay Devarakonda : ఖుషిలో విజయ్, సమంత లిప్‌లాక్??
8Cm Kcr: ముచ్చటగా మూడోసారి.. ప్రధాని పర్యటనకు దూరంగా సీఎం కేసీఆర్..
9SSC Exams : తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు
10BiggBoss Nonstop : బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్.. బిందు మాధవి.. అందరూ అనుకున్నదే అయిందిగా..
-
Taliban Bans Polygamy: బహుభార్యత్వంపై నిషేధం విధించిన తాలిబన్లు
-
Praggnanandhaa: ఉత్కంఠ చెస్ గేమ్: మరోసారి ప్రపంచ నెంబర్ 1ను ఓడించిన చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందా
-
LPG Price Drop : గుడ్ న్యూస్… సిలిండర్ ధరలపై రూ.200 తగ్గింపు..!
-
Ex Minister Vs MLA: నాగర్‌కర్నూల్‌లో మాజీ మంత్రి జూపల్లి వర్సెస్ ఎమ్మెల్యే అనుచరులు
-
Cyber Crime: అనకాపల్లిలో సైబర్ మోసం: కరోనా పరిహారం అంటూ రూ. 90 వేలు కాజేసిన మాయగాళ్లు
-
Oatmeal Packs : చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేసే ఓట్స్ ప్యాక్స్!
-
CM KCR in Delhi: ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీ బిజీ: ఎస్పీ అధినేత అఖిలేష్‌తో ముగిసిన కేసీఆర్ భేటీ
-
Hyderabad Weather: హైదరాబాద్‌లో ఒక్కసరిగా మారిపోయిన వాతావరణం