IPL 2023: కోల్‌క‌తాకు భారీ షాక్‌.. వ‌చ్చాడు.. ఒక్క మ్యాచ్ ఆడాడు.. వెళ్లిపోయాడు

ఓట‌ముల బాధ‌తో ఉన్న కోల్‌క‌తాకు మ‌రో షాక్ త‌గిలింది. బంగ్లాదేశ్ స్టార్ ఆట‌గాడు లిట్ట‌న్ దాస్ కోల్‌క‌తాను విడిచి స్వ‌దేశానికి వెళ్లిపోయాడు.

IPL 2023: కోల్‌క‌తాకు భారీ షాక్‌.. వ‌చ్చాడు.. ఒక్క మ్యాచ్ ఆడాడు.. వెళ్లిపోయాడు

Litton Das returns home

IPL 2023: ఐపీఎల్ 2023 సీజ‌న్ కోల్‌క‌తాకు ఏ మాత్రం క‌లిసిరావ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎనిమిది మ్యాచ్‌లు ఆడ‌గా కేవ‌లం మూడు మ్యాచుల్లోనే గెలిచింది. పాయింట్ల ప‌ట్టిక‌లో ఏడో స్థానంలో కొన‌సాగుతోంది. అస‌లే ఓట‌ముల బాధ‌తో ఉన్న కోల్‌క‌తాకు మ‌రో షాక్ త‌గిలింది. బంగ్లాదేశ్ స్టార్ ఆట‌గాడు లిట్ట‌న్ దాస్ కోల్‌క‌తాను విడిచి స్వ‌దేశానికి వెళ్లిపోయాడు. కుటుంబ స‌మ‌స్య‌ల‌తోనే అత‌డు ఐపీఎల్‌ను అర్ధాంత‌రంగా వీడి బంగ్లాదేశ్‌కు వెళ్లాడు.

ఈ విష‌యాన్ని కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ధృవీక‌రించింది. ‘లిట్ట‌న్ దాస్ కుటుంబంలో మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ ఏర్ప‌డింది. దీంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో అత‌డు బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయాడు. మా మ‌ద్ద‌తు అత‌డికి ఎప్పుడూ ఉంటుంది. క‌ష్టం నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డాల‌ని కోరుకుంటున్నాము.’ అని కోల్‌క‌తా టీమ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. కాగా.. 28 ఏళ్ల లిట్టన్ దాస్ మ‌ళ్లి తిరిగి వ‌స్తాడో లేదో అనే విష‌యాన్ని మాత్రం చెప్ప‌లేదు.

IPL 2023, DC vs KKR: ఎట్ట‌కేల‌కు బోణీ కొట్టిన ఢిల్లీ.. లో స్కోరింగ్ మ్యాచ్‌లో కోల్‌క‌తాపై విజ‌యం

ఒక్క మ్యాచ్ మాత్ర‌మే ఆడాడు

బంగ్లాదేశ్ జాతీయ జ‌ట్టుకు ఆడుతుండ‌డంతో ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌ల‌కు లిట్ట‌న్‌దాస్‌ అందుబాటులో లేడు. ఇటీవ‌లే కోల్‌క‌తా జ‌ట్టుతో క‌లిసాడు. ఏప్రిల్ 20న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో బ‌రిలోకి దిగాడు. కేవ‌లం 4 ప‌రుగులే చేసి తీవ్రంగా నిరాశ‌ప‌రిచాడు. ఇక వికెట్ కీపింగ్‌లో అయితే ల‌లిత్ యాద‌వ్‌, అక్ష‌ర్‌ప‌టేల స్టంపౌట్ అవకాశాల‌ను మిస్ చేశాడు. వీరిద్ద‌రు బాగా ఆడి ఢిల్లీ జ‌ట్టును గెలిపించారు. దీంతో కోల్‌క‌తా ఆడిన త‌రువాతి రెండు మ్యాచుల్లో లిట్ట‌న్ దాస్‌కు తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు.

IPL 2023: అత్యంత అరుదు.. గ‌త 8 మ్యాచుల్లో మొద‌ట బ్యాటింగ్ చేసిన జ‌ట్లే గెలిచాయ్‌.. ఎలాగో తెలుసా..!

బంగ్లాదేశ్‌ నుంచి ఒక్కడే మిగిలాడు

లిట‌న్ దాస్ వెళ్లిపోవ‌డంతో బంగ్లాదేశ్ నుంచి ఐపీఎల్ ఆడుతున్న ఒకే ఒక్క ఆట‌గాడు ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ మాత్ర‌మే. అంత‌క‌ముందు కేకేఆర్‌కే చెందిన షకీబ్ అల్ హసన్ కూడా ఐపీఎల్ నుంచి వైదొలిగిన సంగ‌తి తెలిసిందే.