MS Dhoni:ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించ‌నున్న ధోని.. ఇదే చివ‌రి మ్యాచ్‌.?

ఐపీఎల్(IPL) 2023 సీజ‌న్ చివ‌రి అంకానికి చేరుకుంది. అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో గుజ‌రాత్ టైటాన్స్‌(Gujarat Titans), చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) మ‌ధ్య ఆదివారం(మే 28న‌) జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచ్‌తో ఈ సీజ‌న్ ముగియ‌నుంది.

MS Dhoni:ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించ‌నున్న ధోని.. ఇదే చివ‌రి మ్యాచ్‌.?

MS Dhoni

MS Dhoni Retirement: ఐపీఎల్(IPL) 2023 సీజ‌న్ చివ‌రి అంకానికి చేరుకుంది. అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో గుజ‌రాత్ టైటాన్స్‌(Gujarat Titans), చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) మ‌ధ్య ఆదివారం(మే 28న‌) జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచ్‌తో ఈ సీజ‌న్ ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌డు అంద‌రి దృష్టి ఒకే ఒక్క ఆట‌గాడిపైనే ఉంది. అత‌డే టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు, చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని(MS Dhoni).

ఈ సీజ‌న్ ప్రారంభ‌మైనప్ప‌టికీ మ‌హేంద్రుడి రిటైర్మెంట్‌పైనే చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ధోని వ‌య‌స్సు 41 సంవ‌త్స‌రాలు. మ‌రో రెండు నెల‌ల్లో 42వ‌ ప‌డిలోకి అడుగుపెడ‌తాడు. దీంతో ధోని వ‌య‌స్సు దృష్ట్యా మ‌రో సీజ‌న్ ఆడేది అనుమానంగా మారింది. ఇదే విష‌యం చాలా మంది మాట్లాడినా ఎవ్వ‌రూ కూడా స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. ఆఖ‌రికి ధోని సైతం దీనిపై ఖ‌చ్చిత‌మైన స‌మాచారం ఇవ్వ‌లేదు.

ఈ రోజు ఫైన‌ల్ మ్యాచ్ కావడంతో రిటైర్మెంట్ పై ఓ ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. టాస్ వేసే స‌మ‌యంలో గానీ లేదా మ్యాచ్ ముగిసిన త‌రువాత గాని కెప్టెన్ కూల్ ఈ విష‌యాన్ని చెప్పే అవ‌కాశం ఉంద‌ని ఆ వార్త‌ల సారాంశం. ఈ నేప‌థ్యంలో ఆఖ‌రి మ్యాచ్‌లో విజ‌యం సాధించి ఐపీఎల్‌కు ఘ‌నంగా వీడ్కోలు చెప్పాల‌ని స‌గ‌టు అభిమానులు కోరుకుంటున్నారు. మ‌రీ మ‌హేంద్రుడి నిర్ణ‌యం ఏమిటో ఎవ్వ‌రికి తెలియ‌దు.

IPL2023: ఐపీఎల్ ఫైన‌ల్‌కు వ‌ర్షం ముప్పు.. ర‌ద్దైతే ఆ జ‌ట్టే విజేత‌..? నిబంధ‌న‌లు ఏం చెబుతున్నాయంటే..?

చ‌రిత్ర సృష్టించ‌నున్న ధోని

ఇక ధోని రిటైర్మెంట్ సంగ‌తిని కాస్త ప‌క్క‌న బెడితే మాత్రం ఈ మ్యాచ్ ద్వారా ఓ ఘ‌న‌తను అందుకోనున్నాడు. ఐపీఎల్‌లో ధోనికి ఇది 250వ మ్యాచ్‌. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఆట‌గాడిగా, కెప్టెన్‌గా 250 మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయ‌ర్‌గా ఎంఎస్ ధోని చ‌రిత్ర సృష్టించ‌నున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ధోని 249 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 217 ఇన్నింగ్స్‌ల్లో 39.09 సగటుతో 135.96 స్ట్రైక్ రేట్‌తో 5,082 పరుగులు చేశాడు. ఇందులో 24 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోరు 84*.

ఐపీఎల్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 219 మ్యాచ్‌లు ఆడాడు. 190 ఇన్నింగ్స్‌ల్లో 22 అర్ధ శ‌త‌కాల‌తో 4,508 పరుగులు చేశాడు. మ‌ధ్య‌లో రెండు సంవ‌త్స‌రాలు(2016,17సీజ‌న్ల‌లో) చెన్నై పై నిషేదం ప‌డిన స‌మ‌యంలో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ త‌రుపున ధోని 30 మ్యాచ్‌లు ఆడాడు. 27 ఇన్నింగ్స్‌ల్లో 574 పరుగులు చేశాడు. రెండు అర్ధ‌శ‌త‌కాలు సాధించాడు.