World Cup 2023: మీరలా అయితే.. మేమిలా! బీసీసీఐకి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు..

బీసీసీఐ (భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు)పై ప్రతీకారంగా పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ మండలి) ముందు కీలక ప్రతిపాదన చేసినట్లు తెలిసింది. ఇండియా ఆతిధ్యమివ్వనున్న వన్డే వరల్డ్ కప్-2023లో పాకిస్థాన్ జట్టు తన మ్యాచ్‌లను భారత్‌దేశంలో కాకుండా బంగ్లాదేశ్‌లో ఆడేందుకు సిద్దమని ఐసీసీకి వెల్లడించినట్లు తెలిసింది.

World Cup 2023: మీరలా అయితే.. మేమిలా! బీసీసీఐకి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు..

BCCI vs PCB

World Cup 2023: పీసీబీ (PCB)  బీసీసీఐ (BCCI) కి షాకిచ్చేందుకు సిద్ధమైంది. ఐసీసీ వరల్డ్ కప్‌ 2023 (ICC World Cup 2023) కు భారత్ ఆతిధ్యమిస్తున్న విషయం విధితమే. అయితే, వరల్డ్ కప్‌లో పాల్గోనున్న పాకిస్థాన్ జట్టు (Pakistan team) భారతదేశంలో ఆడేందుకు మొగ్గుచూపడం లేదు. ఇదే విషయాన్ని పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) ఐసీసీ (ICC) వద్ద ప్రస్తావించింది. ప్రపంచకప్ మ్యాచ్‌లను బంగ్లాదేశ్ (Bangladesh) లో ఆడేందుకు ఆ దేశం మొగ్గు చూపుతుంది. ఈ మేరకు ఐసీసీ కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. పాక్ నిర్ణయమే అమలైతే వరల్డ్ కప్‌-2023లో పాకిస్థాన్ జట్టు ఆడే అన్ని మ్యాచ్‌లు బంగ్లాదేశ్‌లోని మైదానాల్లో జరగనున్నాయి.

BCCI Central Contracts: జడేజాకు గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ.. గ్రేడ్ ’బి‘కి పడిపోయిన కే.ఎల్. రాహుల్‌

బీసీసీఐ‌పై ప్రతీకారంగా పీసీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆసియా కప్-2023 (asia cup 2023) టోర్నమెంట్ జరుగుతుంది. పాకిస్థాన్ ఆతిధ్యమిస్తుంది. అయితే, పాకిస్థాన్‌లోని భద్రతా కారణాల దృష్ట్యా ఆదేశంలో భారత జట్టు క్రికెట్ మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధంగా లేదని తేల్చి చెప్పింది. ఈ అంశంపై గత ఐదు నెలలుగా బీసీసీఐ, పీసీబీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇటీవల ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆసియా కప్-2023 టోర్నీలో భారత్ జట్టు ఆడే అన్ని మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో కాకుండా యూఏఈ, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లోని మైదానాల్లో ఆడేందుకు షెడ్యూల్ ప్లాన్ చేసేందుకు నిర్ణయించినట్లు ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ ఈఎస్‌పీఎన్ తన నివేదికలో వెల్లడించింది.

Asia Cup 2023: పంతం నెగ్గించుకున్న భారత్..! ఆసియాకప్‌ టోర్నీలో భారత్ మ్యాచ్‌లు యూఏఈలో..?

ఆసియా కప్ -2023లో బీసీసీఐ తన పంతాన్ని నెగ్గించుకున్నట్లుగానే, భారత్ ఆథిధ్యమిచ్చే వన్డే వరల్డ్ కప్ -2023 లోనూ పాకిస్థాన్ తన పంతాన్ని నెగ్గించుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఐసీసీ సమావేశంలో పాకిస్థాన్ జట్టు ప్రపంచ కప్‌లో తమ మ్యాచ్‌లను ఇండియాలో ఆడేందుకు సిద్ధంగా లేదని పీసీబీ తెలిపింది. భారత్ దేశంకు బదులు బంగ్లాదేశ్ లో మ్యాచ్‌లు ఆడుతామని తేల్చిచెప్పేసింది. దీంతో ఐసీసీలోని సభ్యులుసైతం ఇందుకు దాదాపు అంగీకారం తెలిపినట్లుగా సమాచారం. భారత్ జట్టు ప్రపంచ్ కప్ -2023కు ఆతిధ్యం ఇవ్వడం తమకు అభ్యంతరం లేదని, కానీ, మా జట్టు మాత్రం భారత్‌లో కాకుండా బంగ్లాదేశ్‌లో మ్యాచ్‌లు ఆడుతుందని పీసీబీ (పాకిస్థాన్ కిక్రెట్ బోర్డు) స్పష్టం చేసింది. తద్వారా బీసీసీఐకి గట్టి కౌంటర్ ఇచ్చినట్లుగా పీసీబీ భావిస్తోంది.