Rishabh Pant: బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు పంత్ దూరం.. బీసీసీఐ ఏం చెప్పిందంటే?

ఫామ్ కోల్పోయి వరుస మ్యాచ్‌లలో పరుగులు రాబట్టేందుకు సతమతమవుతున్న టీమిండియా బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై వేటుపడింది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీం మేనేజ్‌మెంట్ పంత్‌ను పక్కన పెట్టింది.

Rishabh Pant: బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు పంత్ దూరం.. బీసీసీఐ ఏం చెప్పిందంటే?

Rishabh Pant

Rishabh Pant: ఫామ్ కోల్పోయి వరుస మ్యాచ్‌లలో పరుగులు రాబట్టేందుకు సతమతమవుతున్న టీమిండియా బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై వేటుపడింది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీం మేనేజ్‌మెంట్ పంత్‌ను పక్కన పెట్టింది. అయితే, ఇలా అకస్మాత్తుగా పంత్ ను తొలగించడంతో సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులు ప్రశ్నలవర్షం కురిపించారు. అయితే, ఆదివారం ఢాకాలోని షేర్- ఏ బంగ్లా నేషనల్ స్టేడియంలో భారత్ – బంగ్లాదేశ్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కు వికెట్ కీపింగ్ బాధ్యతలను రోహిత్ శర్మ రాహుల్ కు అప్పగించాడు.

BCCI President Roger Binny: కోడలి ఎఫెక్ట్.. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీకి ఎథిక్స్ ఆఫీసర్ నోటీసులు

మరోవైపు ఈ మ్యాచ్ కు స్పిన్నర్ అక్షర్ పటేల్ కూడా ఎంపిక కాలేదు. పంత్ ను సిరీస్ నుంచి పక్కకు తప్పించడంపై బీసీసీఐ వివరణ ఇచ్చింది. వైద్యుడిని కలిసేందుకు తీసుకున్న అపాయింట్ మెంట్ కారణంగా రిషబ్ పంత్ బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ ఆడటం లేదని బీసీసీఐ తెలిపింది. రానున్న రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో అతడు తిరిగి జట్టులోకి వస్తాడని పేర్కొంది. ఇదిలాఉంటే అక్షర్ పటేల్ సైతం అందుబాటులో లేడు. ప్రస్తుతం పంత్ స్థానంలో మరే ఇతర ఆటగాడిని తీసుకోలేదు అంటూ బీసీసీఐ వివరణ ఇచ్చింది.

బీసీసీఐ చేసిన ట్వీట్ పట్ల పంత్ అభిమానులు స్పందించారు. పంత్ కు ప్రస్తుతం కొంత విశ్రాంతి అవసరం. బీసీసీఐ మంచి నిర్ణయమే తీసుకుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మ్యాచ్‌కు సీనియర్ పేసర్ షమీకూడా అందుబాటులో లేడు. వెన్ను గాయం కారణంగా సిరీస్ నుంచి దూరమైన సంగతి తెలిసిందే. పంత్ స్థానంలో సంజూ శాంసన్ కు అవకాశం కల్పిస్తే బాగుంటుందని క్రికెట్ అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు. బీసీసీఐ శాంసన్ కు తీరని అన్యాయం చేస్తుందంటూ పలువురు సంజూకు మద్దతుగా బీసీసీఐ తీరును విమర్శిస్తున్నారు.