Tokyo Olympics 2021: ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కైవసం చేసుకున్న సింధు

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. భారత షట్లర్ పీవీ సింధూ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి పతకం సాధించి రికార్డ్ క్రియేట్ చేశారు పీవీ సింధు.

Tokyo Olympics 2021: ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కైవసం చేసుకున్న సింధు

Pv Sindhu

Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. భారత షట్లర్ పీవీ సింధూ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి పతకం సాధించి రికార్డ్ క్రియేట్ చేశారు పీవీ సింధు. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన పీవీ సింధు, ఈసారి బంగారు పతకం తెస్తుందని అందరూ భావించారు. కానీ, కాంస్యంతో సింధు టోర్నీని ముగించింది.

టోక్యో ఒలింపిక్స్‌ సెమీస్‌లో చైనీస్‌ తైపీ క్రీడాకారిణి తైజుయింగ్‌ చేతిలో 18-21, 12-21 తేడాతో ఓటమిపాలవగా.. కాంస్య పతకం కోసం సింధు బింగ్జియావోపై ఆడింది. ఈ క్రమంలో ఆది నుంచి ఆధిపత్యం చెలాయించిన సింధు.. ఫస్ట్ గేమ్‌లో 21-13తో గెలుచుకోగా.. సెకండ్ సెట్‌ను 21-15తో గెలుచుకుంది సింధు.

ఈ ఏడాది జరుగుతన్న టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు దక్కిన రెండో పతకం ఇదే.‌. ఫస్ట్ మెడ‌ల్‌ను వెయిట్‌లిఫ్ట‌ర్ మీరాబాయి చాను అందించింది. సింధు కంటే ముందు రెజ్ల‌ర్ సుశీల్‌కుమార్ మాత్రమే ఒలింపిక్స్‌లో భార‌త్ త‌ర‌ఫున రెండు మెడ‌ల్స్ గెలిచి రికార్డులకు ఎక్కాడు. 2008 గేమ్స్‌లో కాంస్యం‌, 2012 గేమ్స్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్‌ గెలిచిచారు సుశీల్.