SL vs IRE: ఆల‌స్యంగా అరంగ్రేటం చేసినా.. 71 ఏళ్ల రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన లంక ఆట‌గాడు

టెస్టుల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు ప‌డ‌గొట్టిన స్పిన్న‌ర్‌గా శ్రీలంక ఆట‌గాడు ప్ర‌భాత్ జ‌య‌సూర్య‌.ఘ‌న‌త సాధించాడు. గాలె వేదిక‌గా ఐర్లాండ్‌తో జ‌రిగిన రెండో టెస్టులో పాల్ స్టిర్లింగ్‌ను ఔట్ చేయ‌డం ద్వారా జ‌య‌సూర్య ఈ రికార్డును అందుకున్నాడు. కేవ‌లం 7 టెస్టు మ్యాచుల్లో యాభై వికెట్లు ప‌డ‌గొట్టి 71 ఏళ్లుగా ప‌దిలంగా ఉన్న రికార్డును బ‌ద్ద‌లుకొట్టాడు.

SL vs IRE: ఆల‌స్యంగా అరంగ్రేటం చేసినా.. 71 ఏళ్ల రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన లంక ఆట‌గాడు

Prabath Jayasuriya breaks 71 year old Test record

SL vs IRE: ప్ర‌భాత్ జ‌య‌సూర్య‌.. ప్ర‌స్తుతం శ్రీలంక క్రికెట్‌లో పెను సంచ‌ల‌నం. ఆల‌స్యంగా అరంగ్రేటం చేసినా త‌న‌దైన ముద్ర వేస్తూ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొడుతున్నాడు 31 ఏళ్ల ఈ లంక ఆట‌గాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు ప‌డ‌గొట్టిన స్పిన్న‌ర్‌గా ఘ‌న‌త సాధించాడు. గాలె వేదిక‌గా ఐర్లాండ్‌తో జ‌రిగిన రెండో టెస్టులో పాల్ స్టిర్లింగ్‌ను ఔట్ చేయ‌డం ద్వారా జ‌య‌సూర్య ఈ రికార్డును అందుకున్నాడు. కేవ‌లం 7 టెస్టు మ్యాచుల్లో యాభై వికెట్లు ప‌డ‌గొట్టి 71 ఏళ్లుగా ప‌దిలంగా ఉన్న రికార్డును బ‌ద్ద‌లుకొట్టాడు.

జయసూర్య కంటే ముందు వెస్టిండీస్‌కు చెందిన ఆల్‌ఫ్రెడ్ లూయిస్ వాలెంటైన్ అత్యంత వేగంగా 50 టెస్టు వికెట్లు తీసిన స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. 1951లో త‌న ఎనిమిద‌వ టెస్టు అయిన మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వాలెంటైన్ ఈ రికార్డును సాధించాడు. 71 సంవ‌త్స‌రాలుగా ప‌దిలంగా ఉన్న రికార్డును జ‌య‌సూర్య బ‌ద్ద‌లు కొట్టాడు. మొత్తంగా చూసుకుంటే ద‌క్షిణాఫ్రికాకు చెందిన వెర్నాన్ ఫిలాండ‌ర్‌(2012), ఇంగ్లాండ్ మాజీ క్రికెట‌ర్ టామ్ రిచ‌ర్డ్‌స‌న్‌(1896)తో జ‌య‌సూర్య సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఈ లిస్టులో ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ చార్లీ టర్నర్ అగ్ర స్థానంలో ఉన్నాడు. కేవ‌లం 6 టెస్టుల్లోనే అత‌డు యాభై వికెట్లు తీశాడు.

IPL 2023, RR Vs CSK:తోపు బౌల‌ర్ల వ‌ల్ల‌కానిది అశ్విన్‌కే సాధ్య‌మైంది

జ‌య‌సూర్య గ‌తేడాది(జూలై 2022లో) ఆస్ట్రేలియాతో స్వ‌దేశంలో జ‌రిగిన సిరీస్‌లో అరంగ్రేటం చేశాడు. ఆ సిరీస్‌లో 12 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఐర్లాండ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల‌ సిరీస్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీయ‌గా రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. రెండో టెస్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసి స‌త్తా చాటాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. గాలే వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టులో శ్రీలంక ఇన్నింగ్స్ 10 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ను 704/3 వ‌ద్ద డిక్లేర్ చేసింది. కుశాల్ మెండీస్‌(245), నిషాన్ మ‌ధుష్కా(205) ద్విశ‌త‌కాలు సాధించారు. ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 492 ప‌రుగులు చేయ‌గా రెండో ఇన్నింగ్స్‌లో 202 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఫ‌లితంగా రెండు టెస్టు మ్యాచ్‌ల‌ను లంక క్లీన్‌స్వీప్ చేసింది. ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ప్ర‌భాత్ జ‌య‌సూర్య‌కు ద‌క్క‌గా ప్లేయ‌ర్ ఆఫ్ ద సిరీస్‌గా కుశాల్ మెండీస్ నిలిచాడు.

IPL 2023: మ‌హిళ‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ స్టార్ ఆట‌గాడు.. క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌ల్లోకి..!