ట్రంప్ ని కలిసిన సునీల్ గవాస్కర్

  • Published By: venkaiahnaidu ,Published On : August 23, 2019 / 04:20 PM IST
ట్రంప్ ని కలిసిన  సునీల్ గవాస్కర్

టీమిండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. న్యూయార్క్‌లోని ట్రంప్‌ బెడ్‌మినిస్టర్‌ గోల్ఫ్‌ కోర్స్‌లో ట్రంప్‌తో గావస్కర్‌ భేటీ అయ్యారు. ఓ ఛారిటీ ఫౌండేషన్‌ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా ట్రంప్‌కు  గవాస్కర్ వివరించారు. ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.

విండీస్‌-భారత్‌ సిరీస్‌కు కామెంటేటర్‌గా ఉన్న గావస్కర్‌ ఖాళీ సమయంలో ఫౌండేషన్‌ చేస్తున్న సేవా కార్యక్రమాలపై అమెరికాలో ప్రచారం కల్పింస్తున్నారు. న్యూజెర్సీ, అట్లాంటాలో నిర్వహించిన విరాళాల సేకరణ కార్యక్రమాల్లో పాల్గొని సుమారు 230 మందికి సర్జరీ చేసేందుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని గావస్కర్‌ సాధించారు. విరాళాల సేకరణ, హార్ట్‌ టు హార్ట్‌ ఫౌండేషన్‌ పై ప్రజల్లో అవగాహన కల్పించడంలో కోసం గావస్కర్‌ అమెరికా వెళ్లారు. 

పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు నవీ ముంబైలోని శ్రీ సత్య సాయి సంజీవని హాస్పిటల్‌ సహకారంతో ఈ ఫౌండేషన్‌ ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయిస్తోంది. జమైకాలో రెండో టెస్టు ముగిసిన తర్వాత అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ, సీటెల్‌, లూయిస్‌విల్లే, ఇండియన్‌ పోలీస్‌, ఫోర్ట్‌వాయ్‌నే, చికాగో నగరాల్లో జరిగే నిధుల సేకరణ కార్యక్రమాల్లో గావస్కర్‌ పాల్గొననున్నాడు.