T20 World Cup 2021 : దంచికొట్టిన అఫ్ఘాన్ బ్యాటర్లు.. స్కాట్లాండ్ ముందు భారీ లక్ష్యం

టీ20 వరల్డ్ కప్ లో స్కాట్లాండ్ తో సూపర్-12 పోరులో అఫ్ఘానిస్తాన్ బ్యాటర్లు రెచ్చిపోయారు. సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. పరుగుల వరద పారించారు.

T20 World Cup 2021 : దంచికొట్టిన అఫ్ఘాన్ బ్యాటర్లు.. స్కాట్లాండ్ ముందు భారీ లక్ష్యం

T20 World Cup 2021

T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ లో స్కాట్లాండ్ తో సూపర్-12 పోరులో అఫ్ఘానిస్తాన్ బ్యాటర్లు రెచ్చిపోయారు. సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. పరుగుల వరద పారించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్ఘాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ హజ్రతుల్లా జాజాయ్ 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 44 పరుగులు చేయగా, మరో ఓపెనర్ మహ్మద్ షాజాద్ 15 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 22 పరుగులు చేశాడు.

Mohammed Shami : పాకిస్తాన్ వెళ్లిపో, దేశద్రోహి, ఎంత డబ్బు తీసుకున్నావ్… భారత క్రికెటర్‌పై పచ్చి బూతులు

తొలి వికెట్ కు 54 పరుగులు జోడించి ఓపెనర్లు పునాది వేయగా.. నజీబుల్లా, గుర్బాజ్ స్కాట్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. నజీబుల్లా 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు సాధించాడు. గుర్బాజ్ 37 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 46 పరుగులు నమోదు చేశాడు. స్కాట్లాండ్ బౌలర్లలో సఫ్యాన్ షరీఫ్ 2 వికెట్లు తీశాడు. డేవీ, మార్క్ వాట్ తలో వికెట్ తీశారు.