Yasir Shah : బాలికపై అత్యాచారం.. క్రికెటర్‌పై కేసు నమోదు

మైనర్ బాలిక రేప్ కేసులో పై ఎఫ్ఐఆర్ నమోదైంది. యాసిర్, అతడి స్నేహితుడు ఫర్హాన్ తనను వేధించారంటూ ఇస్లామాబాద్ కు చెందిన 14 ఏళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Yasir Shah : బాలికపై అత్యాచారం.. క్రికెటర్‌పై కేసు నమోదు

Yasir Shah

Yasir Shah : పాకిస్తాన్ స్పిన్నర్ యాసిర్ షా చిక్కుల్లో పడ్డాడు. మైనర్ బాలిక రేప్ కేసులో యాసిర్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. యాసిర్, అతడి స్నేహితుడు ఫర్హాన్ తనను వేధించారంటూ ఇస్లామాబాద్ కు చెందిన 14 ఏళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. షా, ఫర్హాన్ తనను కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడ్డారని ఆ బాలిక ఆరోపించింది. ఈ విషయం బయటకు చెబితే తన వీడియోలు విడుదల చేస్తామని బెదిరించారని తెలిపింది. బాలిక ఫిర్యాదుతో యాసిర్ షాపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Whatsapp : వాట్సాప్‍‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఒక్కసారి మాత్రమే చూడొచ్చు..!

యాసిర్ షా స్నేహితుడు ఫర్హాన్‌ తనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఆరోపించింది. తాను పోలీసులను ఆశ్రయించగా.. ఫర్హాన్‌కి యాసిర్ షా సపోర్ట్‌గా నిలిచాడంది. యాసిర్ షా తన స్నేహితుడితో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లి.. విషయం బయటికి చెప్తే.. అత్యాచార సమయంలో తీసిన వీడియోల్ని విడుదల చేస్తామని యాసిర్ షా బెదిరించినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో తెలిపింది.

Hairfall: తక్కువ వయస్సులోనే జుట్టు ఊడిపోవడానికి కారణాలు

ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని.. వాస్తవాలు బయటకు వచ్చాకే దీనిపై స్పందిస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. అతను తప్పు చేసినట్లు తేలితే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. యాసిర్ షా(35) పాకిస్తాన్ టెస్టు స్పెషలిస్ట్ స్పిన్నర్‌. ఇప్పటివరకూ 46 టెస్టులు, 25 వన్డేలు, 2 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 259 వికెట్లు తీశాడు.

కాగా, గతంలో షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిది, బాబర్ ఆజంపైనా రాసలీలల ఆరోపణలు వచ్చాయి. తాజాగా యాసిర్ షా అత్యాచారం కేసులో చిక్కుకోవడం సంచలనంగా మారింది.