IND vs AUS Test Match : తొలి టెస్టులో నలుగురు స్పిన్నర్లు..! ఆ విషయంపై క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా గురువారం ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ తుదిజట్టులో స్పిన్నర్లకు ఎంతమందికి అవకాశం దక్కుతుందన్న ప్రశ్నకు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చారు.

IND vs AUS Test Match : ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ గురువారం నుంచి నాగ్‌పూర్ వేదికగా జరుగుతుంది. ఈ సిరీస్‌లో ఆధిపత్యం చలాయించేందుకు రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. నాగ్‌పూర్ మైదానం పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో ఇరు జట్లు స్పిన్నర్లపైనే దృష్టి కేంద్రీకరించాయి. భారత్ జట్టు ఈ విషయంలో ఆస్ట్రేలియా కంటే ముందంజలో ఉంది. భారత్ జట్టులో నలుగురు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. వీరిలో కనీసం ముగ్గురు స్పిన్నర్లు మొదటి టెస్టు తుది జట్టులో అవకాశం దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.
తొలి టెస్టులో స్పిన్నర్లకు ఎంతమందికి తుది జట్టులో అవకాశం దక్కుతుందన్న ప్రశ్నకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చారు. భారత జట్టులో నలుగురు స్పిన్నర్లు ఉన్నారని, వారందరూ నాణ్యమైన స్పిన్నర్లేనని రోహిత్ తెలిపాడు. రవి అశ్విన్, జడేజా కలిసి చాలా మ్యాచ్‌లలో ఆడారని, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లకు ఎలాంటి అవకాశాలు వచ్చినా అద్భుత ప్రదర్శ చేస్తారని చెప్పాడు. అయితే, తొలిటెస్టు మ్యాచ్‌కు తుది జట్టులో బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ విభాగంలో ప్రతిభకలిగిన వారికి అవకాశం కల్పించడం జరుగుతుందని అన్నారు.
Teamindia: ఆస్ట్రేలియాతో జరిగే తొలిటెస్టు కోసం నాగ్‌పూర్‌లో టీమిండియా ఆటగాళ్ల ప్రాక్టీస్ .. ఫొటోలు
భారత్ జట్టులో నలుగురు స్పిన్నర్లలో జడేజా ఆల్‌రౌండర్. తుది జట్టులో జడేజాకు అవకాశం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు సీనియర్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ ఉన్నారు. అశ్విన్‌కుసైతం తుది జట్టులో అవకాశం ఖాయంగా కనిపిస్తుంది. మూడో స్పిన్నర్‌గా తుదిజట్టులో కుల్‌దీప్ యాదవ్, అక్షర పటేల్ ఇద్దరిలో ఒకరికి తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో అక్షర్ పటేల్ ఆల్‌రౌండ్ ప్రదర్శన ఇస్తాడు. తుదిజట్టులో చోటు దక్కించుకునేందుకు అక్షర్ పటేల్‌కు ఎక్కువ అవకాశాలు ఉంటాయని మాజీలు పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ విషయంపై మాట్లాడిన రోహిత్ శర్మ.. వారిద్దరూ అద్భుతమైన బ్యాటర్లని పేర్కొన్నాడు. అయితే, తుది జట్టులో వీరిద్దరిలో ఎవరిని తీసుకోవాలనే అంశంపై ఇంకా చర్చించలేదని రోహిత్ స్పష్టత ఇచ్చాడు.