సీపీఎల్-2020‌ ఫైనల్‌లో పొలార్డ్ సేన ఘన విజయం.. నాలుగోసారి కప్పు కైవసం!

  • Published By: vamsi ,Published On : September 11, 2020 / 12:18 AM IST
సీపీఎల్-2020‌ ఫైనల్‌లో పొలార్డ్ సేన ఘన విజయం.. నాలుగోసారి కప్పు కైవసం!

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(సీపీఎల్‌ 2020) ఫైనల్‌లో 8 వికెట్ల తేడాతో పొలార్డ్ సారధ్యంలోని ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ కప్‌ను కైవసం చేసుకుంది. లీగ్ దశలో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ ఆల్-మ్యాచ్ విన్నింగ్ రికార్డును క్రియేట్ చెయ్యగా.. ట్రిన్‌బాగో తన పది మ్యాచ్‌ల్లోనూ గెలవడం ఒక చరిత్ర అయితే ఫైనల్ మ్యాచ్‌‍లో కూడా గెలిచి సత్తా చాటుకుంది.


సీపీఎల్‌ 2020 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో సెయింట్ లూసియా జూక్స్ జట్టుపై 8 వికెట్ల తేడాతో భారీ విజయం దక్కించుకుంది. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ కెప్టెన్ పొ

లార్డ్ 4 వికెట్లతో సెయింట్ లూసియా జట్టును కట్టడి చెయ్యగా.. 19.1 ఓవర్లలో 154 పరుగులకు జట్టు ఆలౌట్ అయింది. ట్రిన్‌బాగో లక్ష్యం 155 పరుగులు కాగా.. ఈ స్కోర్‍‌‌ను పొలార్డ్ నేతృత్వంలోని ట్రిన్‌బాగో అలవోకగా 2వికెట్లను మాత్రమే కోల్పోయి చేదించింది. సెయింట్ లూసియా బ్యాట్స్‌మన్‌ ఆండ్రీ ఫ్లెచర్ (39), మార్క్ డీయల్ (29) మాత్రమే లూసీ జుక్స్‌లో రాణించారు.

సెకెండ్ బ్యాటింగ్‌కు దిగిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మొదట్లోనే రెండు వికెట్లు కోల్పోగా.. లెండ్ల్ సిమన్స్ (84*), డారెన్ బ్రావో (58*) రాణించి తమ జట్టుకు సులభమైన విజయాన్ని అందించారు. తొలి ఇన్నింగ్స్ రెండో ఓవర్లో 10 పరుగుల వద్ద రాఖీమ్ కార్న్‌వాల్ వికెట్ కోల్పోయినప్పటికీ, జూక్స్ 11.1 ఓవర్లలో 89/3 స్కోరుతో పెద్ద స్కోరు చేస్తున్నట్లుగా అనిపించింది.

అయితే కెప్టెన్ పొలార్డ్ ఫ్లెచర్‌ను అవుట్ చేయడమే కాక.. ఇన్నింగ్స్ 19 వ ఓవర్లో జావెల్ గ్లెన్, నజీబుల్లా జాద్రాన్ వికెట్లు పడగొట్టాడు. తన నాలుగు ఓవర్లలో పొలార్డ్ కేవలం 30 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. 14 బంతుల్లో 22 పరుగులు చేసిన రోస్టన్ చేజ్ వికెట్ కూడా పొలార్డ్ తీసుకున్నాడు.

ఛాంపియన్లుగా నిలబెట్టిన సిమన్స్, బ్రావో:
155 స్కోరును ఛేజ్ చేసిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ 19పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది, కానీ లెండీ సిమన్స్, డారెన్ బ్రావో మూడో వికెట్‌కు 138 పరుగుల అజేయంగా భాగస్వామ్యం పంచుకోవడంతో సులభంగా టార్గెట్ పూర్తి చేశారు. సిమన్స్ 49 బంతుల్లో 84 పరుగులు చేశాడు, ఇందులో ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. బ్రావో 47 బంతుల్లో 58 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఆరు సిక్సర్లు కొట్టాడు.


నాలుగోసారి సిపిఎల్ టైటిల్ గెలుచుకున్న ట్రిన్‌బాగో నైట్ రైడర్స్:
ఈ సీజన్‌లో టికెఆర్ లీగ్ అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. ఇప్పుడు వారు నాల్గవసారి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. అంతకుముందు, ట్రిన్‌బాగో 2015, 2016 మరియు 2017లలో టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. టికెఆర్ మూడోసారి స్కోరును చేజ్ చేసి టైటిల్‌ను గెలుచుకుంది.

బార్బడోస్ ట్రైడెంట్స్ 2014 మరియు 2019 సంవత్సరాల్లో టైటిల్స్ గెలుచుకోగా, జమైకా తల్వాహాజ్ 2013 మరియు 2016 సంవత్సరాల్లో టైటిల్స్ గెలుచుకున్నారు.