Virat Kohli: సీజన్‌లో తొలి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ

విరాట్ తిరిగి ఫామ్ లోకి వచ్చాడా.. గురువారం వాంఖడే స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 54బంతుల్ోల 73 పరుగులు చేయడం చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. పైగా ఈ ఫీట్ కు సీజన్ లో తొలిసారి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా అందుకున్నాడు.

Virat Kohli: సీజన్‌లో తొలి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ

Virat Kohli (2)

Virat Kohli: విరాట్ తిరిగి ఫామ్ లోకి వచ్చాడా.. గురువారం వాంఖడే స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 54బంతుల్ోల 73 పరుగులు చేయడం చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. పైగా ఈ ఫీట్ కు సీజన్ లో తొలిసారి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా అందుకున్నాడు. గేమ్ ముగిసిన తర్వాత ఆర్సీబీ గెలవడంలో తాను కీలకంగా వ్యవహరించానంటే అది తనకు చాలా సంతోషంగా ఉందని వెల్లడించాడు.

ఫలితంగా పాయింట్ల పట్టికలో ఆర్సీబీ 16పాయింట్లతో ప్లేఆఫ్ రేసు కోసం ఎదురుచూస్తున్నట్లు అయింది.

“ఇలా ముందుకు వెళ్తూనే ఉంటా. ఇంత ముఖ్యమైన ఆటలో ఇక సమస్యలేమీ లేవు. ఇవాళ్లి గేమ్ లో టీమ్ కోసం మంచి ఇంపాక్ట్ చూపించగలిగా. అదే మమ్మల్ని మంచి పొజిషన్ లో ఉంచింది. మరీ మంచి కోణంలోనే చూస్తున్నారు. అంచనాలు అందుకోవడం కోసం నేను కఠినంగా శ్రమించా”

Read Also: కోహ్లీ.. గంగూలీ లాంటి కెప్టెన్ కాలేకపోయాడు – సెహ్వాగ్

“బుధవారం దాదాపు 90నిమిషాల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశా. చాలా ఫ్రీ, రిలాక్స్ గా వచ్చా. షమీ వేసిన బంతికి ఫీల్డర్ల తలలపై నుంచి బంతిని పంపగలనని అనుకన్నా. ఈ ఎడిషన్ లో నాకు అంతకుముందు లేనంత సపోర్ట్ దొరికింది” అని తెలిపాడు విరాట్ కోహ్లీ.