Asia Cup 2022: రేపటి నుంచే ఆసియా కప్.. ప్రాక్టీసు చేసిన తర్వాత కిక్ స్కూటర్‌పై రోహిత్ శర్మ ఎంజాయ్.. వీడియో

యూఏఈ వేదికగా రేపటి నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ లో ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఎల్లుండి భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లు నెట్స్ లో ప్రాక్టీసు చేశారు. ప్రాక్టీస్ ముగిశాక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కిక్ స్కూటర్ పై వెళ్తుండగా తీసిన వీడియోను బీసీసీఐ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఐసీసీ క్రికెట్ అకాడమీ వద్ద కిక్ స్కూటర్ పై రోహిత్ ఇలా ఎంజాయ్ చేశాడు.

Asia Cup 2022: రేపటి నుంచే ఆసియా కప్.. ప్రాక్టీసు చేసిన తర్వాత కిక్ స్కూటర్‌పై రోహిత్ శర్మ ఎంజాయ్.. వీడియో

Asia Cup 2022

Asia Cup 2022: యూఏఈ వేదికగా రేపటి నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ లో ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఎల్లుండి భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లు నెట్స్ లో ప్రాక్టీసు చేశారు. ప్రాక్టీస్ ముగిశాక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కిక్ స్కూటర్ పై వెళ్తుండగా తీసిన వీడియోను బీసీసీఐ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఐసీసీ క్రికెట్ అకాడమీ వద్ద కిక్ స్కూటర్ పై రోహిత్ ఇలా ఎంజాయ్ చేశాడు.

అలాగే, టీమిండియా ప్రాక్టీస్ చేస్తుండగా తీసిన వీడియోను కూడా బీసీసీఐ పోస్ట్ చేసింది. పాక్ తో జరిగే తొలి పోరుకు టీమిండియా సిద్ధమైందని పేర్కొంది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ భారత క్రికెటర్ విరాట్ కొహ్లీ జట్టు సభ్యులతో బిజీబిజీగా గడిపాడు. యూఏఈలో రేపటి నుంచి సెప్టెంబ‌రు 11 వ‌ర‌కు ఆసియా క‌ప్ టోర్న‌మెంట్ జ‌ర‌గనుంది. దీన్ని టీ20 ఫార్మాట్‌లో నిర్వ‌హిస్తారు.

టీమిండియా రోహిత్ శర్మ సారథ్యంలో ఈ టోర్నమెంట్ ఆడనుంది. కొహ్లీ ఆటతీరు కొంతకాలంగా సరిగ్గా ఉండడం లేదు. ఆసియా కప్ ద్వారా మళ్ళీ ఫాంలోకి రావాలని కొహ్లీ భావిస్తున్నాడు. ఆసియా క‌ప్ దుబాయి, షార్జాలో నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ లో భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది.