IPL Auction: చిన్న ప్లేయర్లపై అన్ని కోట్లు కుమ్మరించాల్సిన అవసరం లేదు: గవాస్కర్

ప్పుడిపుడే కెరీర్లో నిలదొక్కుకుంటున్న ఆటగాళ్లను.. కోట్ల రూపాయలు వెచ్చించి వేలంలో కొనుగోలు చేయడం అంత మంచిదికాదని సునీల్ గవాస్కర్ అభిప్రాయ పడ్డారు.

IPL Auction: చిన్న ప్లేయర్లపై అన్ని కోట్లు కుమ్మరించాల్సిన అవసరం లేదు: గవాస్కర్

Ipl

IPL Auction: భారత క్రికెట్ “ఫీవర్”.. ఐపీఎల్ లో జరుగుతున్న ఆటగాళ్ల వేలంపాటపై మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించారు. ఇప్పుడిపుడే కెరీర్లో నిలదొక్కుకుంటున్న ఆటగాళ్లను.. కోట్ల రూపాయలు వెచ్చించి వేలంలో కొనుగోలు చేయడం అంత మంచిదికాదని సునీల్ గవాస్కర్ అభిప్రాయ పడ్డారు. ఎంతో ప్రతిభ ఉన్న యువ ఆటగాళ్లు రాత్రికే రాత్రే కోటీశ్వరులైపోవడం వారి కుటుంబాలకు మంచిదే అయినప్పటికీ..అంత డబ్బును ఒకేసారి చూస్తే ఆటపై ప్రేమ తగ్గిపోతుందని గవాస్కర్ అన్నారు. అండర్ – 19 ప్లేయర్లపైనా..ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరిస్తున్నారని..అంత చేసి ఐపీఎల్ లో వారి ప్రదర్సన ఆకట్టుకుంటుందనే గ్యారంటీ లేదని గవాస్కర్ పేర్కొన్నారు. గంటల వ్యవధిలో ఫలితం తెలిసిపోయే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లలో అంతర్జాతీయ ఆటగాళ్లే తేలిపోతున్న క్రమంలో.. చిన్న ప్లేయర్లను కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేయాల్సిన అవసరం ఏంటని గవాస్కర్ ప్రశ్నించారు. చిన్న ప్లేయర్లపై వేలం ధర గరిష్టంగా రూ.1 కోటి ధర మాత్రమే ఉండేలా చూడాలని ఐపీఎల్ కౌన్సిల్ సభ్యులకు సూచించారు.

Also read: Career Websites: ఉద్యోగాల కోసం ఈ టాప్ 10 వెబ్‌సైట్లను చూడండి

“ఈజీ మనీ” ఆటగాళ్ల ప్రతిభను దెబ్బతీస్తుందని..ఇతర ఫార్మాట్లలో ఆడాల్సి వచ్చినపుడు పేలవ ప్రదర్శన ఉంటే..ఆటలో మజా ఉండదని గవాస్కర్ తెలిపారు. చిన్న ఆటగాళ్లపై ఒక కోటి మాత్రమే గరిష్ట ధర ఉంచితే..వారికి ఆట విలువ తెలిసి.. మరింత కష్టపడతారని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చారు. ఒకటి రెండూ మ్యాచుల్లో ప్రదర్శన బాగున్నంత మాత్రానా.. అటువంటి ఆటగాళ్ల ప్రదర్శన బాగుటుందని చెప్పలేమని గవాస్కర్ అన్నారు. మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, గైక్వాడ్ మరియు పడిక్కల్ వంటి ఆటగాళ్లు ఆస్ట్రేలియా టూర్లో తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారని..అటువంటి వారిపై ఎంత రేటు అయినా పెట్టొచ్చని గవాస్కర్ పేర్కొన్నారు.

Also read: Botsa Satyanarayana: ప్రత్యేక హోదా సాదించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుంది

చిన్న అటగాళ్లు, అండర్ 19 ఆటగాళ్లపై కోట్ల రూపాయలు వెచ్చించడాన్ని తాను తప్పుబట్టడం లేదన్న గవాస్కర్.. ఆ పిల్లలు అక్కడిదాకా చేరుకోవడానికి వారి తల్లిదండ్రులు ఎన్ని త్యాగాలు చేసిఉంటారో తాను అర్ధం చేసుకోగలనని వివరించారు. అయితే..ఆట పరంగా, జట్టు పరంగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నపుడు.. ఆటగాళ్ల నైజాం మారకుండా ఉండాలంటే..ఇలాంటి కట్టడి చర్యలు తీసుకోకతప్పదని లేదంటే ప్రేక్షకుల్లో ఆటపై, ఆటగాళ్లపై చులకన భావన వస్తుందని గవాస్కర్ అన్నారు.

Also read: Sonal Chauhan: సోనాల్ అందాల జాతర.. కిల్లింగ్ పోజులు