Airtel 5G in India : దేశంలో 12 నగరాల్లోకి Airtel 5G సర్వీసులు.. ఫుల్ లిస్ట్ ఇదిగో.. మీ నగరం ఉందేమో ఇప్పుడే చెక్ చేసుకోండి!

Airtel 5G in India : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ (Airtel) తమ 5G సర్వీసులను విస్తరిస్తోంది. ఇప్పటికే ఎయిర్‌టెల్ (Airtel 5G Plus) సర్వీసులను ఇప్పుడు మరిన్ని భారతీయ నగరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.

Airtel 5G in India : దేశంలో 12 నగరాల్లోకి Airtel 5G సర్వీసులు.. ఫుల్ లిస్ట్ ఇదిగో.. మీ నగరం ఉందేమో ఇప్పుడే చెక్ చేసుకోండి!

5G in India _ Airtel 5G services now available in 12 Indian cities, check the full list

Airtel 5G in India : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ (Airtel) తమ 5G సర్వీసులను విస్తరిస్తోంది. ఇప్పటికే ఎయిర్‌టెల్ (Airtel 5G Plus) సర్వీసులను ఇప్పుడు మరిన్ని భారతీయ నగరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే దేశంలో టెలికం దిగ్గజాలైన ఎయిర్‌టెల్ (Airtel), రిలయన్స్ జియో (Reliance Jio) దాదాపు ప్రతిరోజూ 5G లిస్టులో కొత్త నగరాలను యాడ్ చేస్తున్నాయి. కస్టమర్లకు 5G సర్వీసులను వేగవంతంగా అందించేందుకు ఇప్పుడు కొన్ని విమానాశ్రయాల్లో 5G సర్వీసులను కూడా అందుబాటులో తీసుకొచ్చాయి.

ప్రస్తుతం ఎయిర్‌టెల్ (Airtel 5G Services) అనేక నగరాల్లో 5Gని అందిస్తోంది. Airtel 5G ప్రస్తుతం ఢిల్లీ, సిలిగురి, బెంగళూరు, హైదరాబాద్, వారణాసి, ముంబై, నాగ్‌పూర్, చెన్నైతో సహా 12 భారతీయ నగరాల్లో అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత గురుగ్రామ్, పానిపట్, గౌహతిలో కూడా నెట్‌వర్క్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

5G in India _ Airtel 5G services now available in 12 Indian cities, check the full list

5G in India _ Airtel 5G services now available in 12 Indian cities, check the full list

Read Also : Airtel 5G Services : పూణె ఎయిర్‌పోర్టులో ఎయిర్‌టెల్ 5G సర్వీసులు.. మీ ఫోన్‌లో 5G నెట్‌వర్క్ సపోర్టు చేస్తుందో లేదో ఇలా చెక్ చేయండి!

పాట్నా సాహిబ్ గురుద్వారా, పాట్నా రైల్వే స్టేషన్, డాక్ బంగ్లా, మౌర్య లోక్, బైలీ రోడ్, బోరింగ్ రోడ్, సిటీ సెంటర్ మాల్, పాట్లీపుత్ర ఇండస్ట్రియల్ ఏరియా, మరికొన్ని ప్రదేశాలతో సహా పాట్నాలోని అనేక ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ తమ 5G సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. విమానాశ్రయాల విషయానికొస్తే.. వినియోగదారులు బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, పూణేలోని లోహెగావ్ విమానాశ్రయం, వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం, నాగ్‌పూర్‌లోని బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం, పాట్నా విమానాశ్రయంలో ఎయిర్‌టెల్ 5G పొందవచ్చు.

5G in India _ Airtel 5G services now available in 12 Indian cities, check the full list

5G in India _ Airtel 5G services now available in 12 Indian cities

ఇతర టెలికం పోటీదారుల విషయానికొస్తే.. రిలయన్స్ జియో ఇప్పటికే ఢిల్లీ NCR, ముంబై, వారణాసి, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, నాథ్‌ద్వారా, పూణే, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్ వంటి నగరాల్లో 5G నెట్‌వర్క్ ప్రవేశపెట్టాయి.

గుజరాత్‌లోని మొత్తం 33 జిల్లా ప్రధాన కార్యాలయాల్లో కూడా జియో 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. రిలయన్స్ జియో వచ్చే ఏడాది చివరి నాటికి భారత్ అంతటా 5Gని విస్తరిస్తామని హామీ ఇచ్చింది. అయితే మార్చి 2024 నాటికి Airtel అన్ని నగరాల్లో 5G సర్వీసులను పూర్తిగా అందుబాటులోకి తీసుకురానుంది.

ప్రస్తుతానికి, Vodafone Idea (Vi) కస్టమర్‌లకు 5G నెట్‌వర్క్ ఎప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చేది ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. 5G లాంచ్ సమయంలో.. టెలికాం కంపెనీ త్వరలో అందిస్తామని స్పష్టం చేసింది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. టెలికాం కంపెనీలు మరిన్ని నగరాలకు 5G సర్వీసులను అందించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Jio 5G – Airtel 5G : భారతీయ నగరాల్లో జియో – ఎయిర్‌టెల్ 5G సర్వీసులు.. ఇదిగో ఫుల్ లిస్టు మీకోసం.. 5G ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసా?