Apple iPhone 14 Series : ఆపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్.. ఇందులో ఏ ఐఫోన్ కొంటే బెస్ట్ అంటే? ఇప్పుడే తెలుసుకోండి..!
Apple iPhone 14 Series : ఆపిల్ ఈ ఏడాదిలో ఐఫోన్ 15 లైనప్‌లో 4 కొత్త ఐఫోన్ మోడళ్లను ఆవిష్కరించనుంది. ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు బెస్ట్ ఐఫోన్లలో ఏది బెటర్ అంటే?
![Apple iPhone 14 Series : ఆపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్.. ఇందులో ఏ ఐఫోన్ కొంటే బెస్ట్ అంటే? ఇప్పుడే తెలుసుకోండి..! Apple iPhone 14 Series : ఆపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్.. ఇందులో ఏ ఐఫోన్ కొంటే బెస్ట్ అంటే? ఇప్పుడే తెలుసుకోండి..!](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2023/06/iPhone-14-or-iPhone-14-Plus-which-is-the-best-iPhone-to-buy-in-India-right-now.jpg)
iPhone 14 or iPhone 14 Plus, which is the best iPhone to buy in India right now
Apple iPhone 14 Series : భారత మార్కెట్లో పెద్ద సంఖ్యలో ఐఫోన్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అత్యంత సరసమైన ధరకే ఐఫోన్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. చాలామంది వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ ఫోన్లను పక్కన పెట్టేస్తున్నారు. ఆపిల్ కంపెనీకి కూడా భారత్ అత్యంత ముఖ్యమైన మార్కెట్లలో ఒకటి. కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం ఇటీవలే ఢిల్లీ, ముంబైలలో రెండు ఆఫ్‌లైన్ ఆపిల్ స్టోర్లను ప్రారంభించింది.
ఈ రెండు ఆపిల్ రిటైల్ స్టోర్లకు వినయోగదారుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. కొత్త నివేదిక ప్రకారం.. ముంబై, ఢిల్లీలోని స్టోర్లలలో ఒక్కొక్కటి నెలకు రూ. 22 కోట్ల నుంచి రూ.25 కోట్లు ఆర్జిస్తున్నాయి. ఆపిల్ నెలకు మొత్తం రూ.44 కోట్ల నుంచి రూ. 50 కోట్లు సంపాదిస్తోంది. దేశంలోని ఇతర ఎలక్ట్రానిక్స్ స్టోర్ కన్నా రెండు రెట్లు ఎక్కువ అని చెప్పవచ్చు. మీరు ప్రస్తుతం కొత్త ఐఫోన్‌ని కొనేందుకు చూస్తున్నారా? ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ రెండింట్లో ఏది కొనుగోలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆపిల్ ఐఫోన్ 15 అతి త్వరలో అధికారికంగా అందుబాటులోకి రానుంది. ఐఫోన్ 14 సిరీస్ మోడల్‌లలో ఒకదాన్ని కొనుగోలు చేయడం బెటర్. ఆపిల్ సాధారణంగా కొత్త ఐఫోన్ లైనప్‌ను ప్రతి ఏడాదిలో ధరలు పడిపోయిన సమయంలో లాంచ్ చేస్తుంది. 2023 మినహాయింపు కాదనే చెప్పాలి. పుకార్లు, లీక్‌ల ప్రకారం.. టెక్ దిగ్గజం ఐఫోన్ 15 లైనప్ కింద ఈ ఏడాదిలో 4 కొత్త ఐఫోన్ మోడళ్లను ఆవిష్కరిస్తుంది. లేటెస్ట్ జనరేషన్ ఐఫోన్ లేదా ఐఫోన్ 14 సిరీస్ నుంచి ఒకటి కొనుగోలు చేయడం బెస్ట్. ఇప్పుడు, నాలుగు మోడళ్లలో, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ అత్యంత సరసమైన ధరకే అందుబాటులో ఉన్నాయి.
![iPhone 14 or iPhone 14 Plus, which is the best iPhone to buy in India right now](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2023/06/iPhone-14-or-iPhone-14-Plus-which-is-the-best-iPhone-to-buy-in-India-right-now-1.jpg)
Apple iPhone 14 Series : iPhone 14 or iPhone 14 Plus, which is the best iPhone to buy in India
ఐఫోన్ 14 vs ఐఫోన్ 14 ప్లస్.. ఏది బెటర్ అంటే? :
ఐఫోన్ 14 మరింత సరసమైనది. లిమిటెడ్ బడ్జెట్ ఉంటే.. ఐఫోన్ 14 ప్లస్‌కు బదులుగా iPhone 14ని ఎంచుకోవచ్చు. ఆపిల్ ఐఫోన్ 14 ఎక్కువ లేదా తక్కువ అదే స్పెసిఫికేషన్లను అందిస్తుంది. అదే.. ప్లస్ కొంచెం పెద్ద స్క్రీన్‌ను అందిస్తుంది. ఐఫోన్ 14 పర్ఫార్మెన్స్, కెమెరా, బ్యాటరీ లైఫ్ కూడా ఐఫోన్ 14 Plus మాదిరిగానే ఉంటాయి. ఐఫోన్ 14 మరింత కాంపాక్ట్, 6.1-అంగుళాల డిస్ప్లే, బాక్సీ డిజైన్‌తో వస్తుంది.
మరోవైపు, ఐఫోన్ 14 ప్రో-లాంటి 6.7-అంగుళాల రెటీనా డిస్ప్లేను అందిస్తుంది. మీరు ఐఫోన్ 14 ప్రో కోసం భారీగా ఖర్చు పెట్టకూడదని భావిస్తే.. పెద్ద స్క్రీన్ కలిగిన ఐఫోన్ 14 ప్లస్ కొనుగోలు చేయొచ్చు. ఈ ఐఫోన్లో డిస్ప్లే సైజు, కెమెరా, బ్యాటరీ, పర్ఫార్మెన్స్ పరంగా అదే యూజర్ ఎక్స్పీరియన్స్ అందిస్తాయి. ఈ ఐఫోన్లు అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తాయి. తక్కువ కాంతితో సహా అన్ని లైటింగ్ పరిస్థితులలో రియల్ పిక్స్ క్లిక్ చేస్తాయి. ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్ బ్యాటరీ లైఫ్ కూడా అందిస్తుంది.
ధర విషయానికొస్తే.. (iPhone 14) అధికారికంగా రూ. 79,900 ధరతో ప్రారంభమవుతుంది. ఐఫోన్ 14 ప్లస్ ప్రారంభ ధర రూ. 89,900గా ఉంటుంది. మీరు ఐఫోన్‌ను ఆఫ్‌లైన్‌లో కాకుండా ఆన్లైన్ స్టోర్ల నుంచి కొనుగోలు చేయాలి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరిన్నింటితో సహా థర్డ్-పార్టీ ప్లాట్‌ఫారమ్‌లలో వివిధ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.