Ram Charan : రామ్‌చ‌ర‌ణ్‌ మూవీకి పోటీగా మూడు భారీ తమిళ్‌ మూవీస్‌..

గ్లోబల్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ సినిమా గేమ్‌ ఛేంజర్‌తో పోటీకి తమిళ ఇండస్ట్రీ రెడీ అవుతోంది.

Ram Charan : రామ్‌చ‌ర‌ణ్‌ మూవీకి పోటీగా మూడు భారీ తమిళ్‌ మూవీస్‌..

Ram Charan Game Changer may release on Diwali 2024

Updated On : June 25, 2024 / 9:41 PM IST

Ram Charan – Game Changer : గ్లోబల్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ సినిమా గేమ్‌ ఛేంజర్‌తో పోటీకి తమిళ ఇండస్ట్రీ రెడీ అవుతోంది. గేమ్‌ఛేంజర్‌ రిలీజ్‌ డేట్‌ ఇప్పటివరకు ఫైనల్‌ కాకపోయినా, దీపావళికి విడుదలయ్యే చాన్స్‌ ఉందనే ప్రచారం జరుగుతోంది. తమిళులు ఎంతగానో ఇష్టపడే దివాళీ సీజన్‌లో కోలీవుడ్‌ నుంచి మూడు భారీ బడ్జెట్‌ సినిమాలు రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట.. దీపావళి ధమాకాకు రెడీ అవుతున్న చిత్రాలేంటి? వెండితెర గేమ్‌లో బాక్సు బద్ధలుకొట్టే మూవీలేంటి అన్న‌ది ఓ సారి చూసేద్దాం..

ఈ దీపావళికి టాలీవుడ్‌, కోలీవుడ్‌ సినిమాలు సందడి చేయనున్నాయి. ముఖ్యంగా అగ్ర కథానాయుకుల సినిమాలు అన్నీ దీపావళికి రిలీజ్‌ చేసి కలెక్షన్లు మోత మోగించాలని చూస్తున్నారు. తెలుగులో టాప్‌ హీరో, గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నటిస్తున్న సినిమా గేమ్‌ ఛేంజర్‌ దీపావళికే రిలీజ్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు కంప్లీట్ కాక‌పోతే తప్ప రిలీజ్ డేట్ మారే అవకాశం లేదంటున్నారు. సెప్టెంబ‌ర్‌లో దేవ‌ర‌, డిసెంబ‌ర్‌లో పుష్ప-2తోపాటు స్టార్ హీరోలు న‌టించిన మ‌రికొన్ని భారీ బ‌డ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ రెండింటి మ‌ధ్య గ్యాప్‌లోనే గేమ్ ఛేంజ‌ర్‌ను విడుద‌ల చేయాల‌ని ఫిక్సైన‌ట్లు స‌మాచారం. జూలైలోనే రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ క‌న్ఫర్మేష‌న్ రానున్నట్లు సమాచారం.

Buddy trailer : అల్లు శిరీష్ ‘బ‌డ్డీ’ ట్రైల‌ర్‌.. అన్యాయంపై తిరగబ‌డ్డ టెడ్డీబేర్‌ను చూశారా..?

ఇక గేమ్‌ఛేంజర్‌ మూవీ రిలీజ్‌ సమయంలోనే కోలీవుడ్‌ అగ్రకథానాయకులు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. విశ్వనటుడు కమల్‌హసన్‌ నటిస్తున్న థగ్‌లైఫ్‌తోపాటు సూర్య నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కంగువ’.. కూడా దీపావళికే రిలీజ్‌ కానుందట… ఇక అజిత్ నటిస్తున్న విదా ముయార్చి సైతం దీపావళి రేసులోనే ఉందని సమాచారం. ఇలా నాలుగు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలకు రెడీ అవుతుండటంతో దీపావళి రేసు ఆసక్తికరంగా మారింది.

ఇలా నాలుగు భారీ బడ్జెట్‌ సినిమాలు ఒకేసారి రిలీజ్‌ అయితే… కలెక్షన్లు, థియేటర్ల పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. కోలీవుడ్‌ సినిమాలు తెలుగులో రిలీజ్‌ అవుతున్న సమయంలో టాలీవుడ్‌ టాప్‌ హీరోల సినిమాలు రిలీజ్‌ చేస్తుండటం వల్ల తమ సినిమాల కలెక్షన్లు తగ్గిపోతున్నాయని కోలీవుడ్‌ వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయట. అందుకే టాలీవుడ్‌లో పెద్ద సినిమా రిలీజైనప్పుడు తమ ఇండస్ట్రీలో స్పేస్‌ మొత్తం తమ సినిమాలే ఆక్రమించాలనే ప్లాన్‌తో ముగ్గురు అగ్ర హీరోల సినిమాలను దీపావళికి రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కలెక్షన్లు సంగతేమోకాని నాలుగు పెద్ద చిత్రాలు ఒకేసారి రిలీజ్‌ అయితే అభిమానులకు పసందే.

Indian 2 trailer : క‌మ‌ల్ హాస‌న్ ‘ఇండియ‌న్ 2’ ట్రైల‌ర్‌.. అవీనితిని నిర్మూలించేందుకు తిరిగొచ్చిన సేనాపతి