Apple iPhone 15 roundup: ఐఫోన్ 15లోని మరిన్ని ఫీచర్లు లీక్..

ఐఫోన్ 15 విడుదల కావడానికి మరి కొన్ని నెలల సమయం ఉంది. అయితే, దాని ఫీచర్లకు సంబంధించిన లీకులు ఇప్పటికే వస్తున్నాయి. ఆపిల్ సాధారణంగా ప్రొ వర్షెన్లలో సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతుంది. అయితే, ఈ ఏడాది వనిల్లా మోడల్ కూడా అనేక ప్రత్యేకతలతో యూజర్ల ముందుకు వస్తుంది.

Apple iPhone 15 roundup: ఐఫోన్ 15లోని మరిన్ని ఫీచర్లు లీక్..

Apple iPhone 15 roundup

Apple iPhone 15 roundup: ఐఫోన్ 15 విడుదల కావడానికి మరి కొన్ని నెలల సమయం ఉంది. అయితే, దాని ఫీచర్లకు సంబంధించిన లీకులు ఇప్పటికే వస్తున్నాయి. ఆపిల్ సాధారణంగా ప్రొ వర్షెన్లలో సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతుంది. అయితే, ఈ ఏడాది వనిల్లా మోడల్ కూడా అనేక ప్రత్యేకతలతో యూజర్ల ముందుకు వస్తుంది.

దీంతో ఐఫోన్ 15 విడుదల అయ్యేదాకా వేచిచూడాలా? లేదా ఇప్పటికే భారత మార్కెట్లో లభ్యమవుతున్న ఆపిల్ కొత్త ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఎల్లో వేరియంట్లు కొనొచ్చా? అని ఆలోచిస్తున్నారు కొందరు యూజర్లు. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో ఆపిల్ కొత్త ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఎల్లో వేరియంట్లు కొంత డిస్కౌంట్లో కూడా లభ్యమవుతున్నాయి. ఐఫోన్ 15 ఫీచర్ల గురించి పూర్తిగా తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.

ఈ ఏడాది 6.2 డిస్ ప్లేతో ఐఫోన్ 15 రానుంది. అలాగే, అధిక సామర్థ్యం ఉన్న బ్యాటరీతో, యూఎస్బీ-సీ పోర్టుతో దీన్ని ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆపిల్ ఇప్పటికే యూఎస్బీ-సీ పోర్టులను ఐప్యాడ్, మాక్ లలో వాడుతోంది. ఫ్లాట్ ఎడ్జ్స్, వెనుక డ్యుయెల్ కెమెరాలు చతురస్రాకార మాడ్యూల్ లో ఉంటుంది.

ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ లో ఉన్నట్లే ఐఫోన్ 15లో డైనమిక్ నాచ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది విడుదల కానున్న ఐఫోన్ లో మరిన్ని ఫీచర్లను ఆపిల్ జోడించనుంది. ఈ ఐఫోన్ 15లో ప్రొమోషన్ డిస్ ప్లే టెక్ ను ఆపిల్ ప్రవేశపెడుతుందా? అన్న అంశంపై స్పష్టత లేదు. సాధారణంగా ప్రొ మోషన్ 120Hz డిస్ ప్లేతో ఉంటుంది.

ఎన్నో ఆండ్రాయిడ్ ఫోన్లలో దీన్ని ప్రవేశపెట్టారు. స్మూత్ గా యూజర్లు స్క్రోల్ చేసుకునే అనుభవాన్ని ఇస్తుంది. గేమింగ్ కు మరింత అనుకూలంగా ఉంటుంది. అలాగే, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో ఐఫోన్ 15 రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇది ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ లో ఉంది. గత మూడేళ్లుగా రెగ్యులర్ ఐఫోన్లు 12 మెగాపిక్సెల్ వెనుక కెమెరాలతో వస్తున్నాయి.

అలాగే, ఏ16 బయోనిక్ ఎస్ఓసీ ఫీచర్ తో ఆపిల్ ఐఫోన్ 15 విడుదల కానుంది. ఈ ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరులో ఐఫోన్ 15 విడుదలయ్యే అవకాశం ఉంది. ఐఫోన్ 15 పరిమాణం పెంచితే బ్యాటరీ సైజు కూడా పెరుగుతుంది. కొత్త ఫీచర్లను ప్రవేశపెడితే ఐఫోన్ 15 ధర పెరుగుతుంది. గత రెండేళ్లుగా బేస్ వేరియంట్ల ధర రూ.79,900 నుంచి ప్రారంభం అవుతోంది. ఈ సారి మాత్రం ధర రూ.85,000 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
OnePlus 11R Discount Price : అమెజాన్‌లో వన్‌ప్లస్ 11R స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఫీచర్ల కోసమైన ఈ 5G ఫోన్ కొనొచ్చు? ధర ఎంత తగ్గిందో తెలుసా?